బ్రెజిల్‌కు చెందిన ఫిట్‌నెస్ మోడల్ కరోల్ రోసలిన్ ( Fitness model Carol Rosalin )అందమైన శరీరాకృతితో ఇపుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్( Artificial Intelligence ) ఆమె శరీరాన్ని విశ్లేషించి “పర్ఫెక్ట్ ఫిమేల్ బాడీ” అని కొనియాడింది.
ప్లేబాయ్ ఆస్ట్రేలియా సైతం కరోల్ ఫిట్‌నెస్, ఆరోగ్యం, బలానికి “పర్ఫెక్ట్ 10” మార్కులు వేసింది.బాడీ సిమెట్రీ, ప్రొపోర్షన్, ఓవరాల్ హార్మొనీ (మొత్తం మీద ఆకర్షణ) వంటి అంశాల ఆధారంగా AI ఈ విశ్లేషణ చేసింది.ఫిట్‌నెస్ ప్రపంచంలో కరోల్ శరీరం ఆదర్శవంతమైనదని ప్లేబాయ్ ఆస్ట్రేలియా ( Playboy Australia )ప్రశంసించింది.
25 ఏళ్ల కరోల్ సావో పాలోలో ఉంటోంది.సంవత్సరాల తరబడి ఎంతో కష్టపడి, క్రమశిక్షణతో వ్యాయామాలు చేస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ ఈ శరీరాకృతిని సొంతం చేసుకున్నట్లు కరోల్ తెలిపింది.ఆమె కఠినమైన ఫిట్‌నెస్ రొటీన్‌ను పాటిస్తూ, సహజమైన, ప్రాసెస్ చేయని ఆహారాలతో నిండిన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటుంది.
తన కఠోర శ్రమ, పట్టుదలతోనే ఈ గుర్తింపు వచ్చిందని కరోల్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
కరోల్ గత ఎనిమిదేళ్లుగా వ్యాయామాలు చేస్తోంది.ఇప్పుడు వారంలో ఐదు రోజులు వెయిట్ ట్రైనింగ్, ప్రతిరోజు ఏరోబిక్ వ్యాయామాలు ( Aerobic exercises )చేస్తుంది.చికెన్, కూరగాయలు, పండ్లు, ఓట్స్, కస్సావా (ఒక దుంప) వంటి ఆహార పదార్థాలు ఆమె డైట్‌లో ఉంటాయి.
కాల్చిన స్వీట్ పొటాటో చిప్స్, వెజిటబుల్ ఫ్రిట్టాటాస్ ఆమెకు ఇష్టమైన ఆహారాలు.గుడ్లు, బొప్పాయి, పైనాపిల్, కస్సావా, ఓట్స్, దాల్చినచెక్క, కాఫీ వంటివి ఆమె బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటుంది.
ఫిట్‌నెస్‌తో పాటు తన ఆహార నియమాల వల్లే తాను ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణమని కరోల్ చెబుతోంది.
ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గానే కాకుండా, కరోల్ అడల్ట్ కంటెంట్ కూడా క్రియేట్ చేస్తుంది.ఇన్‌స్టాగ్రామ్‌లో 9 లక్షల 59 వేల మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది.తన అందం, ఫిట్‌నెస్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.అయితే, కరోల్ ఫిట్‌నెస్ రొటీన్‌ను గుడ్డిగా అనుసరిస్తే అందరికీ ఒకే ఫలితం రాకపోవచ్చని ఫిట్‌నెస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఫ్లో అథ్లెటిక్ డైరెక్టర్ బెన్ లూకాస్ మాట్లాడుతూ, జనటిక్స్, జీవనశైలి శరీర ఆకృతిలో ప్రధాన పాత్ర పోషిస్తాయని వివరించాడు.“పర్ఫెక్ట్ బాడీ” అనే ఆలోచన వ్యక్తికి వ్యక్తికి మారుతుందని, దానికోసం ట్రై చేయడం మూర్ఖత్వం అని ఆయన నొక్కి చెప్పాడు.