అనసూయ.ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఎందుకంటే ఇటు బుల్లితెర ప్రేక్షకులకు అటు వెండితెర ప్రేక్షకులకు ఈ అమ్మడు సుపరిచితురాలుగా మారిపోయింది.ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీ తో ఈ అమ్మడు లైఫ్ లో సెటిల్ అయిపోయింది అంటే అది అతిశయోక్తి కాదేమో.
జబర్దస్త్ కార్యక్రమం లో తన యాంకరింగ్ తో తన చిరు నవ్వుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అంతకుమించి పొట్టి పొట్టి డ్రెస్సులతో అందాల ఆరబోతతో మరి కొంతమందిని కూడా తనవైపు తిప్పుకుంది.
ఇక అక్కడితో సరి పెట్టుకోలేదు.సినిమాల్లో అవకాశాలు వస్తే అక్కడ చేయడం మొదలు పెట్టింది.
డైరెక్టర్లు ఇచ్చిన పాత్ర పుణ్యమొ.లేకపోతే అనసూయ అదృష్టమో తెలియదు కానీ.ఈ అమ్మడు చేసిన పాత్రలు ఎందుకొ సినిమాలో హైలెట్గా మారాయ్.ప్రేక్షకులకు నచ్చేసాయ్.
ఇంకేముంది అనసూయ గొప్ప నటి అంటూ కొంతమంది పొగడటం మొదలుపెట్టారు.యాంకర్ అనసూయ కూడా ఇదే నిజమని నమ్మేసింది పాపం.
పుష్ప సినిమాలో లేడీ విలన్ క్యారెక్టర్ చేసింది.కానీ అనసూయకు ఇవన్నీ సూట్ కావేమో అన్న నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చేశాయ్.అయినా అనసూయ ఇవన్నీ పట్టించుకోలేదు.దర్జా అనే సినిమాలో ఫుల్ లెంత్ లేడీ విలన్ పాత్రలో కనిపించింది.

అది కూడా ఏకంగా తనకు కోపం వస్తే ఎమ్మెల్యే లను సైతం మటాష్ చేసే పవర్ఫుల్ విలన్ పాత్ర.ఇక ఇలాంటి పాత్రలో బాగా నటించి హావభావాలను పలికించి అద్భుతమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మెప్పిస్తే అనసూయకు తిరుగు ఉండేది కాదేమో.కానీ అలాంటి పవర్ఫుల్ పాత్ర పోషించడంలో అనసూయ తేలిపోయింది.ఈ సినిమా మొదటి రోజు నుంచి బ్యాడ్ టాక్ సొంతం చేసుకుంది.దీంతో అనసూయ రాంగ్ స్టెప్ వేసింది అంటూ అందరూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఊహించని రేంజిలో క్రేజ్ తెచ్చి పెట్టిన జబర్దస్త్ ని వదిలేసి ఇక సినిమాలే అంటూ కమిట్ అయింది అనసూయ.
జబర్దస్త్ ను వదిలేసి ఇక ఇప్పుడు మా స్టార్ మా లో ఓ చిన్న కార్యక్రమం చేసింది.సినిమాల కోసమే అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకుంది అన్నది అందరూ చెబుతున్న మాట.అయితే అనసూయ ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అన్న వాదన మాత్రం ప్రస్తుతం బలంగా వినిపిస్తుంది అని చెప్పాలి.