ఎటువంటి మొటిమలు ( pimples )లేకుండా ముఖ చర్మం అందంగా కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని దాదాపు ప్రతి ఒక్కరు కోరుకుంటారు.అటువంటి చర్మాన్ని పొందడం కోసం రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు.
అయితే మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది? అవి ఎన్ని లాభాలను చేకూరుస్తాయి? అన్న విషయాలు పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ హోమ్ రెమెడీ ( Magical home remedy )మాత్రం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ రెమెడీ మొటిమల్లేని మెరిసే చర్మాన్ని మీ సొంతం చేస్తుంది.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వేపాకు పొడి( Neem powder ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్( Orange Peel Powder ), పావు టీ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ) మరియు సరిపడా వచ్చి పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేసుకుంటూ వాటర్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఫైనల్ గా మంచి మాయిశ్చరైజర్ ను చర్మానికి అప్లై చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటించారంటే అద్భుత ఫలితాలు పొందుతారు.వేపలో ఉండే ఔషధ గుణాలు, ఆరెంజ్ పీల్ లో ఉండే విటమిన్లు, పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మొటిమలకు, మచ్చలకు వ్యతిరేకంగా పోరాడుతాయి.ఆయా సమస్యలకు అడ్డుకట్ట వేస్తాయి.అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా మారుస్తాయి.తేనె మరియు పాలు కూడా చర్మానికి చక్కని పోషణ అందిస్తాయి.చర్మాన్ని మృదువుగా చేస్తాయి.
స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తాయి.మొత్తంగా ఈ రెమెడీని పాటించడం వల్ల మొటిమలు, మచ్చలు లేని మెరిసే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.