ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడటం వల్ల ఎన్ని నష్టాలో తెలుసా..?

ఇటీవ‌ల కాలంలో దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్ లో మొబైల్ అనేది ఒక భాగం అయిపోయింది.అసలు ఫోన్ లేనిదే బయట కాలు కూడా పెట్టడం లేదు.

 Side Effects Of Using A Phone First Thing In The Morning! Using Phone, Morning,-TeluguStop.com

ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల‌( Smart phones ) వినియోగం భారీగా పెరిగిపోయింది.స్కూల్ కు వెళ్లి పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు అందరూ స్మార్ట్ ఫోన్ లను విరివిగా ఉపయోగిస్తున్నారు.

కొందరైతే రాత్రుళ్లు నిద్ర సమయాన్ని వృధా చేస్తూ ఫోన్ చూస్తుంటారు.అలాగే ఉదయం నిద్ర లేవగానే దాదాపు అందరూ చేసే పని ఫోన్ చూడటం.

తమకు ఎవరైనా కాల్ చేశారా? మెసేజ్ చేశారా? అని కొంద‌రు చూసుకుంటారు.ఇంకొందరు ఫోన్ ఓపెన్ చేయగానే సోషల్ మీడియాలోకి దూరేసి గంటలు గంటలు ఆ నిద్ర మంచం పైనే గడుపుతుంటారు.

అయితే ఉదయం నిద్ర లేవ‌గానే ఫోన్ చూడటం వల్ల లాభాలు ఎన్ని ఉంటాయ‌న్నది పక్కన పెడితే.నష్టాలు మాత్రం అధికంగా ఉంటాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Lifestyle, Effectsphone, Phone Effects, Wake-Telugu Health

నిద్రలేచిన వెంటనే మీ ఫోన్‌ని చెక్ చేయడం వల్ల స్పష్టంగా ఆలోచించడం కష్టమవుతుంది.అంటే మీ ఆలోచ‌న శ‌క్తి బ‌ల‌హీన‌ప‌డుతుంది.అలాగే పొద్దు పొద్దునే నిద్ర క‌ళ్ల‌తో ప్రకాశవంతమైన స్క్రీన్‌ని చూస్తూ ఉండటం మీ కళ్ళు ఒత్తిడికి గురవుతాయి.

ఇది మీ మొత్తం దృష్టి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.త‌ల‌నొప్పి, పొడి కళ్ళు( Headache, dry eyes ) త‌దిత‌ర స‌మ‌స్యలు ఇబ్బంది పెడ‌తాయి.

Telugu Tips, Lifestyle, Effectsphone, Phone Effects, Wake-Telugu Health

నిద్రలేచిన( woke up ) వెంటనే ఫోన్ చూడ‌టం వ‌ల్ల అనేక రకాల సమాచారం మరియు నోటిఫికేషన్‌లు మీ మైండ్ లో గంద‌ర‌గోళం సృష్టిస్తాయి.ఇది ఒత్తిడికి దారితీస్తుంది.నిద్రపోయే ముందు మరియు నిద్రలేచిన వెంటనే మీరు మీ ఫోన్‌తో నిమగ్నమవ్వడం వల్ల మీ నిద్ర చక్రానికి అంతరాయం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి.స్క్రీన్‌ల ద్వారా వెలువడే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తికి( stimulates melatonin production ) ఆటంకం కలిగిస్తుంది.

ఫ‌లితంగా నిద్ర‌లేమి బారిన ప‌డ‌తారు.నిద్ర‌లేచిన వెంట‌నే మొబైల్ ఫోన్ చూస్తే స‌మ‌యాన్ని వృధా చేస్తే మీరు ఉదయం మరియు రోజంతా పూర్తి చేయాల్సిన పనులపై దృష్టి పెట్టడం క‌ష్ట‌త‌రం అవుతుంది.

కాబ‌ట్టి, ఇక‌నైనా నిద్ర‌లేచిన వెంట‌నే ఫోన్ ప‌ట్టుకుని కూర్చునే అల‌వాటు ఉంటే మానుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube