నాగచైతన్యతో పరిచయం, ప్రేమ, పెళ్లి పై శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు!

సినీ నటుడు నాగచైతన్య( Nagachaitanya ) శోభిత ( Sobhita ) వివాహం డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులు సినిమా సెలబ్రిటీలు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.అయితే వీరిద్దరిది ప్రేమ వివాహం అనే సంగతి మనకు తెలిసిందే.

 Sobhita Revealed About Love And First Meet With Nagachaitanya , Nagachaitanya, S-TeluguStop.com

ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇదిలా ఉండగా పెళ్లి తర్వాత ఈ జంట మొదటిసారి న్యూయార్క్ టైమ్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ కొత్త జంట ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

Telugu Meet, Love, Nagachaitanya, Sobhita, Sobhitarevealed-Movie

ముఖ్యంగా శోభితకు నాగచైతన్యతో ఎక్కడ పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ఎలా ప్రేమగా మారిందనే విషయాలను ఈ సందర్భంగా శోభిత బయటపెట్టారు.ఇక మొదటిసారి ఈమె నాగార్జునకు ( Nagarjuna ) సంబంధించిన ఒక షోలో భాగంగా నాగచైతన్యను కలిసినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు.అప్పటివరకు నేను నాగ చైతన్యను ఎప్పుడూ కూడా కలవలేదని అదే మొదటిసారి కలవడం అని శోభిత తెలిపారు.

ఇక ఆ తర్వాత మేము ఎప్పుడూ కూడా కలవలేదు మాట్లాడుకోలేదు కానీ 2021 సమంతకు విడాకులు ఇచ్చిన కొన్ని నెలలకు అంటే 2022 ఏప్రిల్ నెలలో నాగచైతన్య ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేశారు అయితే ఆ పోస్ట్ కు తాను రిప్లై ఇచ్చినట్టు శోభిత తెలిపారు.

Telugu Meet, Love, Nagachaitanya, Sobhita, Sobhitarevealed-Movie

చైతన్యకు రెస్టారెంట్ ఉండటం చేత ఫుడ్ కి సంబంధించి ఒక పోస్ట్ చేయడంతో తాను రిప్లై ఇచ్చానని అప్పటినుంచి ఫోన్లో చాటింగ్స్ చేసుకోవడం ఫోన్ కాల్స్ మాట్లాడటం వంటివి జరుగుతూ వచ్చాయి.ఇలా ఫోన్లోనే చాటింగ్ చేసుకుంటూ ఉన్నటువంటి ఈ జంట మొదటిసారి ముంబైలోని ఓ కేఫ్ లో కలిశారట.అప్పట్లో శోభిత ముంబైలోనే ఉండటంతో చైతన్య ముంబైకి వెళ్లి తనని కలిసారట అప్పటినుంచి తమ మధ్య ప్రేమ మొదలైంది అంటూ ఈ సందర్భంగా శోభిత నాగచైతన్యతో పరిచయం ప్రేమ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube