ప్రస్తుత రోజులలో నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.ఇలా నిత్యం వైరల్ అవుతున్న వీడియోలలో జంతువులకు, పక్షులకు( animals , birds ) సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతు నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ప్రపంచంలో నలు మూలల ఏదో ఒక వైపు వింతలు విశేషాలు జరుగుతూనే ఉంటాయి.ఈ క్రమంలో తాజాగా ఒక కోడి జగన్నాథ స్వామి విగ్రహం ( Jagannath Swamy statue )ముందు వంగి మరి నమస్కారం పెడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.సాధారణంగా ఒడిస్సా( Odisha ) లోని పూరిలో కొలువైన జగన్నాథుడిని దేశమరుమూలల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటూ కొంటారు.అలాంటి ఒడిస్సాలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఒకచోట ఎత్తైన పీఠంపై జగన్నాథ విగ్రహం ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో అక్కడకు ఒక కోడి( chicken ) వచ్చి జగన్నాధ విగ్రహం ముందు ప్రార్థన చేయడం మనం వీడియోలో చూడవచ్చు.ఈ క్రమంలో జగన్నాథ భక్తులకు ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంది.
ఒక కోడి ఇలా దేవుడి పటం ముందర నిలబడి ప్రార్థించడం చూసిన భక్తులు ఆశ్చర్య పోతున్నారు.ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి.
వీడియోని చూసిన కొంత మందిని నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.కొంత మంది ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడు అంటే ఇదే నిదర్శనం అంటూ కామెంట్ చేస్తూ ఉంటే.
మరికొందరు “జగన్నాథ స్వామికి జై” అంటూ కామెంట్ చేస్తున్నారు.