పిలిచి అవకాశం ఇస్తే పవన్ సినిమాను పూజా చేయడానికి ఎన్ని సార్లు నో చెప్పిందో తెలుసా ?

సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా ముందుక సాగాలంటే అంత ఈజీ ఏమీ కాదు.వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటే.

 Why Pooja Hedge Rejected Pawan Kalyan Movies, Pooja Hedge, Pawan Kalyan, Movies,-TeluguStop.com

నెమ్మదిగా దుకాణం సర్దుకునే పరిస్థితి వస్తుంది.హీరోలతో పోల్చితే హీరోయిన్ల పరిస్థితి మరింత అధ్వాహ్నంగా ఉంటుంది.

అందుకే హీరోయిన్లు సినిమాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.కథ విషయంలో ఒకటికి రెండు మార్లు ఆలోచిస్తారు.

అలాగే ప్రస్తుతం సౌత్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే సైతం తన కెరీర్ విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటుంది.ఆయా సినిమాల్లోని క్యారెక్టర్లు తనకు నచ్చితేనే ఓకే చెప్తుంది.

స్టార్ హీరో సినిమా అయినంత మాత్రాన.మామూలు క్యారెక్టర్ చేసేందుకు అస్సలు ఒప్పుకోదు.

ఇక మెగా హీరోల్లో.రాం చరణ్, అల్లు  అర్జున్, వరుణ్ తేజ్ తో కలిసి నటించి ఈ ముద్దుగుమ్మ పవన్ కల్యాణ్ సినిమాల్లో చేసే అవకాశం రెండు సార్లు వచ్చినా.

తను మాత్రం నో చెప్పిందట.దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పవన్ కల్యాణ్ హీరోగా చేసిన వకీల్ సాబ్ సినిమాలో శ్రుతి హాసన్ ప్లే చేసిన రోల్.పూజా చేయాల్సి ఉండోనట.ఈ పాత్రకోసం తొలుత తననే అడిగారట.అయితే ఈ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేక పోవడంతో సున్నితంగా నో చెప్పిందట.అటు పవన్ తాజా మూడీ హరి హర వీరమల్లు కోసం మరోసారి అడిగారట.అయితే ఈ క్యారెక్టర్ కూడా తనకు అంతగా సూట్ కాదని చెప్పి ఒప్పుకోలేదట.

పవన్ ఒక్కడే కాదు.నటనా ప్రాధాన్యత లేని పలు సినిమాలను పూజా వదులుకుందట.

నితిన్ హీరోగా చేసిన మాస్ట్రో, బెల్లకొండ శ్రీనివాస్ చేసిన ఛత్రపతి రీమేక్ కోసం పూజాను అడిగారట.అయితే రీమేకులు చేయడం తనకు నచ్చక నో చెప్పిందట.

అటు బెల్లంకొండ అల్లుడు అదుర్స్ సినిమా కోసం అడిగితే డేట్స్ ఖాళీగా లేక చేయలేను అన్నదట.జాన్ అబ్రహం ఎటాక్, అమితాబ్ మూవీ గుడ్ బైలో నటించే అవకాశం ఉన్న మంచి క్యారెక్టర్ కాకపోవడంతో నో చెప్పిందట.

అటు సమంతా శాకుంతం సినిమాలో తొలుత హీరోయిన్ గా పూజాను అనుకున్నాడట గుణ శేఖర్.అయితే ఎక్కువ డేట్లు కావాలని చెప్పడంతో తను నో చెప్పిందట.

అయితే శాకుంతలం సినిమాను వదులుకోవడం పూజా చేసిన పొరపాటు అని చాలా మంది సినీ జనాలు అనుకుంటున్నారట.ఆమె అభిమానులు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారట.అటు ఈ అమ్మడు నటించిన భారీ సినిమాలు త్వరలో జనాల ముందుకు రాబోతున్నాయి.ఈ లిస్టులో ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు ఉన్నాయి.ఈ సినిమాలతో పూజా రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube