బాబాయ్ పవన్ ఫోన్ నెంబర్ ను నిహారిక ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే ఈయన జనసేన పార్టీ( Janasena Party ) ని స్థాపించిన తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చేసి పూర్తిగా రాజకీయాలలోనే బిజీగా గడుపుతున్నారు.ఇక గత ఎన్నికలలో భాగంగా ఈయన అత్యధిక మెజారిటీతో గెలవడమే కాకుండా కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు తీసుకున్నారు.

 Niharika Says Interesting Things About Pawan Kalyan , Pawan Kalyan, Niharika, Kk-TeluguStop.com

ఇక ఏపీ డిప్యూటీ సీఎం గా అలాగే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

Telugu Deputycm, Janasena, Niharika, Pawan Kalyan, Tollywood-Movie

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మెగా డాటర్ నిహారిక ( Niharika ) పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈమె నిర్మాతగా కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి పలు విషయాలను వెల్లడించారు.

Telugu Deputycm, Janasena, Niharika, Pawan Kalyan, Tollywood-Movie

పవన్ కళ్యాణ్ బాబాయ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న మాకు మాత్రం పవర్ స్టారేనని తెలిపారు.ఎన్నికల ఫలితాల రోజు మేమంతా టీవీ ముందే కూర్చుని ఉన్నామని ఆరోజు మా అమ్మ చాలా ఎమోషనల్ అయిందని తెలిపారు.ఇక కళ్యాణ్ బాబాయ్ ఇచ్చే స్పీచ్ లు చాలా బాగుంటాయి ఆ స్పీచులు నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తాయని నిహారిక తెలిపారు.ఆయన రాజకీయాల్లో ఉన్నా స్టారే.

బాబాయ్ ని ఎక్కువగా రాజకీయ నాయకుడిగానే ఇష్టపడతానని తెలిపారు.అంతేకాకుండా తన బాబాయ్ ఫోన్ నెంబర్ ని తన మొబైల్ లో KKK అని సేవ్ చేసుకున్నట్లు నిహారిక తెలిపారు.

KKK అంటే కొణిదెల కళ్యాణ్ కుమార్ అంటూ పవన్ కళ్యాణ్ అసలు పేరును ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.ప్రస్తుతం నిహారిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube