పుట్టినరోజు వేల గొప్ప మనసు చాటుకున్న సితార.. తండ్రికి తగ్గ తనయ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu) గారాల పట్టి సితార ( Sitara ) ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సితార ఇంత చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ భారీ స్థాయిలో డబ్బును సంపాదిస్తున్నారు.

 Sitara Helps Neet Qualified Girl For Her Mbbs Education , Mahesh Babu, Sitara, N-TeluguStop.com

అదేవిధంగా పలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ భారీ స్థాయిలో డబ్బు సంపాదిస్తున్నారు.ఇక ఇంత చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సితార ఎంతో మంచి మనసును కూడా కలిగి ఉంది అని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకున్నారు.

Telugu Mahesh Babu, Mbbs, Navya, Neet Qualified, Sitara, Krishna-Movie

ఇప్పటికే మహేష్ బాబు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లను నిర్వహించి వారికి పునర్జన్మ అందించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా సితార సైతం తన తండ్రి బాటలోనే సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు.ఇప్పటికే ఒక జ్యువలరీ సంస్థను ప్రమోట్ చేయగా వచ్చిన రెమ్యూనరేషన్ కోటి రూపాయలను మహేష్ ఫౌండేషన్ కి అందజేసిన సంగతి తెలిసిందే.అంతే కాకుండా గత పుట్టిన రోజు( Birthda y)  వేడుకలలో భాగంగా స్కూల్ కి వెళ్తున్నటువంటి అమ్మాయిలకు సైకిల్లను కొని ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు.

తాజాగా మరో అమ్మాయికి సహాయం చేస్తూ సితార గొప్ప మనసు చాటుకుంది.

Telugu Mahesh Babu, Mbbs, Navya, Neet Qualified, Sitara, Krishna-Movie

ఒక మాములు పేద కుటుంబానికి చెందిన నవ్య( Navya ) అనే అమ్మాయి నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయింది.అయితే ఆమె డాక్టర్ చదువు చదివే అంత స్తోమత లేకపోవడంతో ఈ విషయం మహేష్ బాబు అభిమానుల ద్వారా మహేష్ ఫౌండేషన్ వరకు చేరుకుంది.దీంతో ఆ అమ్మాయి చదువు బాధ్యతలను మొత్తం మహేష్ బాబు ఫౌండేషన్,సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ ద్వారా ఆమెకు సహాయం చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇక సితార నవ్యతో బర్త్ డే సెలబ్రేట్ చేసుకొని అడ్వాన్స్ గా 1,25,000 రూపాయల చెక్ ని ఆమెకు తన చేతుల మీదగా అందచేయడంతో నవ్వ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ సితారతో పాటు మహేష్ బాబు ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube