మూసినది ప్రక్షాళన వ్యవహారంపై తెలంగాణ అధికార విపక్ష పార్టీల మధ్య మాటల దాడి జరుగుతూనే ఉంది.మూసి ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిదమవుతుండడం, తదితర వ్యవహారాలపై బీఆర్ఎస్( BRS ) గత కొద్ది రోజులుగా విమర్శలు చేస్తోంది.
దీనికి కాంగ్రెస్( Congress ) నుంచి కూడా అంతే బీ ఆర్ ఎస్ కు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై( KTR ) విమర్శలు చేస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై( CM Revanth Reddy ) తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ విమర్శలు చేసింది.
ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పైన , రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు బీఆర్ఎస్ చేసింది.సున్నాలు, కన్నాలు వేసే రేవంతూ నీ మతిలేని చర్యలతో హైదరాబాద్ మహానగర పరువు తీస్తున్న కాంగ్రెస్ పార్టీ.
నువ్వు హైదరాబాద్( Hyderabad ) బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడడం సిగ్గుచేటు అంటూ ఎక్స్ లో స్వీట్ చేసింది .బీఆర్ఎస్ హయాంలో ప్రణాళికలు రూపొందించిన మూసి( Musi River ) పునర్జీవ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ 16500 కోట్లు. ఇప్పుడు అది అమాంతం ఎందుకు పెరిగినట్లు ? అదే ప్రాజెక్టు తట్ట మట్టి ఎత్తకుండా వ్యయాన్ని రూ.16,500 కోట్ల నుంచి రూ.1,50,000 కోట్లకు ఎందుకు పెంచినట్లు ? పెరిగిన ప్రాజెక్టు అంచనా వ్యయం ఎవరి జేబులు నింపడానికి ? మొదట మూసి సుందరీకరణకు రూ.1,50,000 కోట్లు కావాలని అంటున్నావ్ అది నోరా లేక మోరా ?
మూడు, నాలుగు నెలల్లోనే లక్ష కోట్ల వ్యయం ఎలా పెరిగింది ? ఆ సొమ్ము అంతా ఢిల్లీకి కప్పం కట్టడానికా ? పనులు మొదలవ్వక ముందే అంచనాలు పెంచి ప్రజల సొమ్మును పందికొక్కుల్లాగా తినడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటి .ఈ మూసి ప్రాజెక్టు కూడా ఆ కోవలోకి చెందిందేనా ? గుంపు మేస్త్రి మూసీ ప్రక్షాళన కంటే ముందు నీ నోటిని ప్రక్షాళన చేసుకో. ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేయకుండా పూటకో మాట మార్చి నోటుకు వచ్చింది ఒర్రకు.
ఇట్లనే ఒర్రుకుంటూ పోతే రంగు పడుద్ది అంటూ బీఆర్ఎస్ విమర్శలు చేసింది.