రైతు రుణమాఫీ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్

సూర్యాపేట జిల్లా: బ్యాంకర్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు.సోమవారం జిల్లా కేంద్రంలోని నాగార్జున గ్రామీణ బ్యాంక్,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,ఎడిబి బ్యాంకులో జరుగుతున్న రుణమాఫీ ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి బ్యాంకులో రైతు ఖాతాలో జమవుతున్న రైతు రుణమాఫీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.

 District Collector Examined The Farmer Loan Waiver Process, District Collector ,-TeluguStop.com

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్యాంకు సిబ్బంది చూడాలని తేలిపారు.గ్రామీణ బ్యాంకు నందు కేసారం గ్రామంలో వచ్చిన మేరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలెక్టర్ మాట్లాడారు.

రుణమాఫీ రైతు ఖాతాలో ఎంత జమ అయిందో పరిశీలించారు.ఖాతాలో రూ.95,650 రైతు రుణమాఫీ క్రింద జమ అయినవని రైతు కలెక్టర్ కు తెలిపారు.

అనంతరం ఎస్బిఐ ఎడిబి బ్యాంకును కలెక్టర్ పరిశీలించారు.రైతు రుణమాఫీ వాల్య తండా గ్రామానికి చెందిన ధరావత్ నాగులు రూ .81,057 రుణమాఫీ కింద లోన్ తీసుకోనగా ప్రభుత్వం పూర్తిగా 81,057 రుణమాఫీ చేసిందని కలెక్టర్ కు వివరించారు.పిల్లల జగ్గుతండా గ్రామానికి చెందిన గుగులోతు సాజి క్రాప్ లోను ద్వారా రూ.94,148 తీసుకొనగా రుణమాఫీ కింద ప్రభుత్వం రూ.94,148 జమ చేసిందని సంతోషంగా కలెక్టర్ కు వివరించారు.బ్యాంకర్లు రైతులకు రుణమాఫీ ఆధార్ అనుసంధానం చేసిన ఖాతాలో జమైనది వివరంగా తెలపాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో లీడు బ్యాంకు మేనేజర్ చింతల బాబూజీ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి,వ్యవసాయ అధికారి దినకర్,బ్యాంకు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube