సూర్యాపేట జిల్లా:జిల్లాలోని కోదాడ,చిలుకూరు, హుజూర్ నగర్,చింతలపాలెం మండలాల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు కిన్నెర మధుని పోలీసులు అరెస్ట్ చేసి,జైలుకు తరలించినట్లు సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చిలుకూరు మండలం బేతవోలు ఎక్స్ రోడ్ వద్ద కోదాడ రూరల్ సిఐ ప్రసాద్,చిలుకూరు ఎస్సై శ్రీనివాస్ తనిఖీ చేస్తుండగా నిందితుడు మధు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాల విషయం ఒప్పుకున్నట్లు,నిందుతుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి 38 తులాల బంగారం స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.నిందితుడు మధును గతంలో పలు దొంగతనాల కేసులలో అరెస్ట్ చేసి పలుమార్లు జైలుకు తరలించినట్లు చెప్పారు.2018 సంవత్సరంలో వరంగల్ సెంట్రల్ జైలుకు వెళ్లి ఒక సంవత్సరం పాటు జైల్లో ఉండి బయటికి వచ్చినట్లు తెలిపారు.అనంతరం కేసును ఛేదించి,విధి నిర్వహణలో బాగా పని చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించి బహుమతులు అందజేశారు.




Latest Suryapet News