ప్రజాపాలనలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు:జిల్లా కలెక్టర్ వెంకట్రావు

సూర్యాపేట జిల్లా:జిల్లాలో గత మూడు రోజుల నుండి నిర్వహిస్తున్న అభయహస్తం-ప్రజాపాలన కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు.శనివారం సూర్యాపేట( Suryapet ) పట్టణ పరిధిలోని ఐదవ వార్డు దురాజ్ పల్లిలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని సిబ్బందికి సూచనలు చేశారు.

 Arrangements Will Be Made Without Difficulties For People In Public Administrati-TeluguStop.com

సూర్యాపేట మున్సిపాలిటిలోని ప్రతి వార్డులో టెంట్లు, మంచినీటి సౌకర్యం, కౌంటర్లను,సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్న మున్సిపల్ కమీషనర్ కు అభినందనలు తెలిపారు.

ప్రజలు తొందరపడి గుంపులుగా రావద్దని, జనవరి ఆరవ తేదివరకు గ్రామాలలో,వార్డులలో దరఖాస్తులు స్వీకరిస్తారని, తరువాత కూడా ప్రభుత్వ కార్యాలయాల వద్ద దరఖాస్తులు అందజేయవచ్చని అన్నారు.

ప్రతిచోట కూడా తొక్కిసలాట లేకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు.మెప్మా ఆర్పిలు, ఇతర సిబ్బంది ప్రజలకు అందుబాటులో వుండి దరఖాస్తులు ఇవ్వడంతో పాటు,దరఖాస్తులు స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

దరఖాస్తులు స్వీకరించే సమయంలో గ్యాస్ కార్డు మరియు కరెంటు మీటర్ నంబర్ ను నమోదు చేయాలని సిబ్బందికి తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ రామాంజులరెడ్డి( Ramanjula Reddy ),డిఇ సత్యారావు,వార్డు కౌన్సిలర్ భాషా,కాంగ్రెస్ పార్టీ నాయకులు పటాన్ సైదాఖాన్,మద్దెబోయిన తిరుమలేష్,కొర్లపల్లి వెంకన్న,నభిఖాన్, మొండికత్తి లింగయ్య, నగేష్,పల్స ఉపేందర్, జానయ్య,భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube