- సూర్యాపేట జిల్లా:
తెలంగాణ ఉద్యమకారుడు,రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేసేందుకు కుట్రపన్నిన వ్యవహారంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి కుట్రకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ విజ్ఞప్తి చేశారు.గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో *జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్* తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన శ్రీనివాస్ గౌడ్ ను కొందరు ఆయన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక హత్యకు కుట్ర చేశారని మండిపడ్డారు.ఈ కుట్ర వెనుక అగ్రవర్ణాలకు చెందిన రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు అనుమానం కలుగుతుందన్నారు.
తెలంగాణలో హింసకు తావు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సాగిస్తుంటే కొంతమంది అరాచక శక్తులు తమ రాజకీయ ఉనికి కోల్పోతామని అక్కసుతోనే ఉద్యమకారుడు బీసీ వర్గానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నారని అన్నారు.ప్రభుత్వం వెంటనే ఉన్నత స్థాయి అధికారులతో ఎంక్వైరీ కమిటీ వేసి విచారణ చేసి హత్యకు కుట్ర పన్నిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి బొమ్మగాని వెంకన్న,నాయకులు అమరవాది శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.