నిజాం కాలం నుండే తెలంగాణలో భూ సమస్య ఉంది:గద్దర్

యాదాద్రి భువనగిరి జిల్లా: త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని బాధిత రైతులు సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన రెండు రోజుల రిలే నిరాహార దీక్షకు తొలి రోజు ప్రజా యుద్ధనౌక గద్దర్ ( Gaddar )హాజరై రైతులకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి సమస్య తెలంగాణ సమస్య,నిజాం ఉన్నప్పటి నుంచి భూమి సమస్య ఉందన్నారు.

 There Is A Land Problem In Telangana Since The Time Of Nizam Gaddar , Gaddar, N-TeluguStop.com

ధరణి అనే పేరుతో తెలంగాణలో పెద్ద కుట్ర జరిగిందని,పంట పెట్టుబడి సాయం పేరుతో బీడు భూములుగా మార్చారని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.బీడు భూములను కార్పొరేట్ కు ధారాధత్తం చేశారని ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్ కూడా భూ పోరాటాలు జరిగాయని,ప్రపంచ యుద్ధాలు కూడా భూమి కోసం జరిగాయని, తెలంగాణలో గత 10ఏళ్ల కాలంలో రైతులకు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు.భువనగిరి సభ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం మొదలైందని గుర్తు చేశారు.

ఓటు అనే ఆయుధంతో పోరాడండి, విప్లవాన్ని తీసుకురండి అని పిలుపునిచ్చారు.పార్లమెంటులో రైతు చుట్టాలు చేస్తే,పంజాబ్ రైతులు పోరాటాలు చేసి రద్దు చేయించారు.

భూసేకరణ జీవోను రద్దు చేయిద్దామని,భూములు కోల్పోతున్న రైతులకు భూమి ఇవ్వాలని కోరుతున్నామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube