సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణంలో 11వ వార్డులోని డాక్టర్ బాబు ఇంటి వద్ద గత కొంత కాలంగా నిరుపయోగంగా ఉన్న చేతి పంపుకు మోక్షం నేడు కలిగింది.వేసవి నీటి ఎద్దడి కారణంగా ఆ వార్డు మాజీ కౌన్సిలర్ సోదరుడు కస్తాల దిల్ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి మరమ్మతులు చేసి ప్రజలకు నీటి సౌకర్యం కల్పించారు.
వార్డు ప్రజల నీటి కష్టాలు దృష్టిలో ఉంచుకుని చేతిపంపును బాగుచేయించిన కస్తాల దిల్ కు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కస్తాల సైదులు, గోపాలదాస్ కిరణ్,పంపు ఆఫరేటర్ ఎల్లావుల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.







