సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల/ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేడు ధరిత్రి దినోత్సవం ఘనంగా నిర్వహించారు.మండల విద్యాధికారి ధారాసింగ్ హాజరై పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు.
ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞను చేయించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ధరిత్రి దినోత్సవం సంబంధించి డ్రాయింగ్,ఎస్సే రైటింగ్ పోటీలు నిర్వహించగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు యాకమల్లు,రమేష్,క్రిష్ణ, తిరుమలేష్,బాబు,గణేష్, కరుణాకర్,సుధాకర్,రుక్మిణి, విజయనిర్మల,రంగారెడ్డి, సంతోష్,వసంత,విద్యార్థులు పాల్గొన్నారు.







