మనం అనుకున్నది సాధించడానికి కొండంత కష్టపడితే చాలదు గోరంత అదృష్టం కూడా ఉండాలంటారు మన పెద్దవాళ్ళు .అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే.
సెలబ్రెటీలకు ఆ అదృష్టం బహుశా పుట్టుకతోనే వచ్చింది.ఆ అదృష్టమే ఆరొవ వేలు.
ఈరోజు మనం మాట్లాడుకోబోయే సెలబ్రెటీలకు 6 వేళ్లు వుంటాయి.ఆ ఆరొవ వేలు వలన వాళ్ళ కష్టానికి అదృష్టం తోడైందని అంటుంటారు.మరి వాళ్లెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ లిస్ట్ లో మొదటి వ్యక్తి ఇండియన్ సూపర్ హీరో అండ్ డాన్సర్స్ లో ఒకరైన హృతిక్ రోషన్.ఈయన కుడి చేతి బొటన వేలుకి ఇంకొక వేలు అతుక్కొని ఉంటుంది.అయితే ఈయన స్టార్ కదా ఆ వేలుని సర్జరీ ద్వారా తీసేయించవచ్చు కదా అని అనుకోవొచ్చు కానీ హృతిక్ కి ఆ వేలు కలిసొచ్చిందని, అది తనకు చాల లక్కీ ఫింగర్ అని చెబుతుంటాడు.
నిజంగానే హృతిక్ కి అది లక్కీ ఫింగరే ఎందుకంటే క్రిష్ లాంటి సూపర్ హీరో సినిమా ఇండియాలో చాల న్యాచురల్ గా వర్క్ అవుట్ చేసి ఆతర్వాత వాటికీ క్రిష్ 2, క్రిష్ 3, లాంటి సీక్వెన్సులు తీసి నిజమైన ఇండియన్ సూపర్ హీరో అనిపించుకుంది ఇండియన్ హీరోస్ లో ఒక్క హృతిక్ రోషన్ మాత్రమే.

ఇక ఈ లిస్ట్ లో అందాల హీరోయిన్ నయనతార కూడా ఉంది.ఈమె తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, లాంటి ఎన్నో భాషల్లో సినిమాలు చేసి ఇండియా లెవల్లో ఎంతోమంది అభిమానులని సంపాదించుకుంది.అయితే ఈమె చేతికి 6 వ వేలు ఉంటుందని ఎవ్వరు ఊహించి ఉండరు.
ఈమెకి కూడా పుట్టినప్పటి నుండే ఎడమ చేతికి ఆరొవ వేలు ఉందట.అయితే అది కాస్త చిన్నదిగా కనపడడంతో పెద్దగా ఎవరు పట్టించుకునే వారు కాదు.
ఇంకా ఈ ఆరొవ వేలు ఉండడం వలనే ఈమే కెరియర్ ఇప్పటికి సక్సెస్ఫుల్ గా నడుస్తోందని అంటున్నారు.ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అందరి సూపర్ స్టార్స్ తో నటించింది ఈ నయనతార.
అదంతా ఆ ఆరొవ వేలు మహిమ అంటూ చెప్పుకుంటున్నారు.

ఇక ఈ లిస్ట్ లో 6 అడుగుల అందాల భామ దీపికా పదుకునే కూడా వుంది.ఈమెని బాలీవుడ్ క్వీన్ అని కూడా అంటారు.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించడమే కాదు షారుఖ్ ఖాన్ కి బెస్ట్ జోడి అని కూడా అంటారు.
అయితే దీపికాకి కూడా ఆరొవ వేలు ఉందట.అయితే ఈమెకి చేతికి కాదు కాలుకి ఆరొవ వేలు ఉండడం విశేషం.అయితే దీపికా దాన్ని ఒక సినిమా షూటింగ్ లో భాగంగా సర్జరీ ద్వారా తొలగించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.లేదు అదేంలేదు ఆమె కాలుకి ఇంకా ఫింగర్ ఉందని ఇంకొంతమంది చెప్తూ వుంటారు.
ఏదిఏమైనా గాని దీపికా చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే ఈమె ఇప్పటివరకు నటించిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అండ్ బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ లాంటి భర్త దొరకడం కూడా దీపికా అదృష్టమే.
అదండీ ప్రెసెంట్ అయితే మన ఇండియాలో 6ఫింగర్స్ తో ఉన్న సెలబ్రిటీస్ వీళ్ళు మాత్రమే.
ఇక హాలీవుడ్ లో అయితే అమెరికన్ ఫేమస్ టీవీ జర్నలిస్ట్ ఓప్రా విన్ఫ్రే, X-మెన్ లాంటి ఎన్నో సినిమాల్లో ఫేమస్ అయిన హీరోయిన్ హాలీ బెర్రీ, ఇంకా జేమ్స్ బాండ్ సిరీస్ లో డిఫరెంట్ పాత్రల్లో కనిపించిన నటి గెమ్మ ఆర్టర్టన్ ఇలా చాలామందే వున్నారు.అయితే నిజంగా 6thఫింగర్ ఉండటం అదృష్టమా అంటే అది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.
కానీ ఆరొవ ఫింగర్ వున్నవాళ్లు చాలా అదృష్టవంతులని చాల సందర్భాల్లో రుజువైందట.