సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువుదీరాక గత ప్రభుత్వంలో ఇచ్చిన సామాజిక పెన్షన్లు పడక పోవడంతో పెన్షన్ దారుల్లో టెన్సన్ మొదలైంది.గత ప్రభుత్వం ఆసరా పథకం కింద వృద్ధులు, వితంతువులు,చేనేత కార్మికులు,కల్లుగీత కార్మికులు,బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవి,పైలేరియా బాధితులకు నెలకు రూ.2016,వికలాంగులకు రూ.3016 పెన్షన్ ఇచ్చేది.తాము అధికారంలోకి వస్తే పెన్షన్ దారులకు రూ.4000,వికలాంగులకు రూ.6000 చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.కానీ,సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని వృద్ధులకు డిసెంబర్ నెలలో పింఛన్ పడలేదని,జనవరిలోనైనా పడుతుందో లేదో తెలియడం లేదని పెన్షన్ పై ఆధారపడి జీవించే వృద్దులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
పెంచే పెన్షన్ సంగతి దేవుడెరుగు ఉన్న పెన్షన్ అయినా ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని వృద్దులు కోరుతున్నారు.