అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలి

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్ నందు నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన పేదలందరికీ వెంటనే పంపిణీ చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంబూరి సూర్యం డిమాండ్ చేశారు.బుధవారం తెలుగు దేశం పార్టీ నాయకులతో కలిసి బాలాజీ నగర్ లోని డబుల్ బెడ్ రూం ఇళ్లను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీ పరిధిలోనీ 35వార్డులో అనేకమంది పేదలున్నారని,పట్టణంలో అసలు నివాస గృహం లేనివారు చాలామంది ఉన్నారని, వారిలో కూడా కడు నిరుపేదలు చాలామంది ఉన్నారని, అందులో నిజమైన లభ్దిదారుల ఎంపిక చేస్తేనే పేదవారికి న్యాయం జరుగు తుందన్నారు.

 All Deserving Should Be Given Double Bedroom Houses-TeluguStop.com

ప్రభత్వ అధికారులు అర్హులను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉప్పుగండ్ల శ్రీనివాసరావు,ప్రదాన కార్యదర్శి పిడతల శ్రీనివాస రావు,రేవంత్ రెడ్డి.

షేక్ హబీబ్.సజ్జా రామోహన్ రావు,జనార్దన్ రెడ్డి,టేకుమట్ల దుర్గారావు,షేక్ బాబా షర్ఫుద్దీన్,గంటా ఆదాము,సాగర్,విశ్వనాధం, యల్లయ్య,బాబ్జీ,పండు తదితరులు పాల్గోన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube