అన్ని వర్గాల బంధువు మల్లు స్వరాజ్యం

సూర్యాపేట జిల్లా:ఈనెల 29న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో జరిగే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సంస్మరణ సభకు అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మీ పిలుపునిచ్చారు.మల్లు స్వరాజ్యం సంస్మరణ సభను విజయవంతం చేయాలని కోరుతూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు ఆటో ప్రచార జాతాలను జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో జెండా ఊపి ప్రారంభించారు.

 Relative Mallu Swaraj Of All Communities-TeluguStop.com

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నతనంలోనే తుపాకీ చేతపట్టి ప్రజలను దోపిడీ,పీడన నుండి విముక్తి కల్పించడం కోసం పోరాడిన వీర వనిత మల్లు స్వరాజ్యం అని అన్నారు.మహిళా ఉద్యమ నాయకురాలిగా ఉండి,మహిళా హక్కుల కోసం కృషి చేసిందన్నారు.

సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని మహిళలకు తోడుగా నిలిచిందన్నారు.ప్రజా ప్రతినిధిగా గెలిచి ప్రజా సమస్యలను చట్టసభల్లో వినిపించి పోరాడిందన్నారు.

పార్టీ నాయకులను,కార్యకర్తలను నిర్బంధానికి గురిచేస్తే ప్రభుత్వంతో తగువులాడి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిందన్నారు.అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మల్లు స్వరాజ్యం సంస్మరణ సభకు అందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోట గోపి,జె.నరసింహారావు,మేకనబోయిన శేఖర్, మేకనబోయిన సైదమ్మ,వీరబోయిన రవి,చినపంగి నర్సయ్య,పులుసు సత్యం,నాయకులు వజ్జ శ్రీను, మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube