నా అనుకున్నవారు పోయిన కూడా ముద్దుల్లో మునిగితేలుతున్న బాలీవుడ్ సెలెబ్స్

ఇద్దరు బాలీవుడ్ సెలబ్రెటీలు తమ వైఖరితో ఇపుడు నెటిజన్లు ట్రోలింగ్ కి గురవుతున్నారు.ఇంతకీ ఎవరా సెలబ్రిటీలు అంతగా ఏం చేశారు అంటే…ఒకరేమో ప్రముఖ యాక్టర్, ప్రెజంటర్, ఫ్యాషన్ డిజైనర్ అయిన మందిరా బేడీ కాగా మరొకరు బాలీవుడ్ నటి,  ప్రముఖ సింగర్ నటి షెహనాజ్ గిల్.

 Bollywood Celebs Are Getting Trolled For These Acts, Famous Singer Actress Shehn-TeluguStop.com

ఈ ఇద్దరు కూడా హద్దులు మీరారు అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.అసలేం జరిగింది అంటే ? బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అయిన రాజ్ కౌశల్ ని నటి మందిరా బేడీ 2009 లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.వీరికి వీర్ అనే బాబు ఉన్నాడు అలాగే ఒక అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు ఈ దంపతులు.కాగా ఇటీవల నిర్మాత రాజ్ కౌశల్ ఇటీవల గుండెపోటు తో మరణించిన విషయం తెలిసిందే.

భర్త మరణంతో దుఖ సంద్రంలో మునిగిపోయిన మందిరలో ఇంతలోనే పెను మార్పు కనిపించడంతో అంతా అవాక్ అవుతున్నారు.

తాజాగా నటి మందిర తన స్నేహితుడితో కలిసి దిగిన ఫోటోలు ఇపుడు నెట్టింట వైరల్ గా మారాయి.

మందిరా బేడీ వెకేషన్ అంటూ థాయిలాండ్‌లోని ఫుకెట్‌ కు వెళ్లారు.అక్కడ తన స్నేహితుడితో కలిసి తీసుకున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు ఆది అంటూ తన స్నేహితుడికి విషెస్ చెప్తూ పోస్ట్ చేశారు.

అంతేకాదు మీకు ఆనందం సంతోషం అన్ని దక్కాలి.నా ప్రియమైన స్నేహితుడా నిన్ను 17 ఏళ్ల నుండి ప్రేమిస్తూనే ఉన్నాను అని పేర్కొనడంతో అంతా షాక్ అయ్యారు.

ఇక ఆ ఫొటోస్ అయితే అంతకన్నా షాకింగ్ గా ఉన్నాయి.ఆ ఫోటోలలో మందిర బికినీలో చాలా గ్లామరస్ గా తన స్నేహితుడితో చాలా సన్నిహితంగా కనిపించింది, దాంతో ఈ ఫోటోలు చూసిన వారంతా భర్త చనిపోయి ఏడాది కూడా గడవక ముందే ఇలా మరొకరితో సన్నిహితంగా కనిపించడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇదేం పని మందిర భేడి అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.ఇక ఇదే తరహాలో బాలీవుడ్ నటి, సింగర్ అయిన హెహనాజ్ కూడా ట్రోల్స్ మద్య చిక్కుకున్నారు.సీరియల్ యాక్టర్ సిద్ధార్థ్‌ శుక్లా , షెహనాజ్ గిల్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే అయితే ఇటీవలే అతడు గుండె పోటుతో మరణించాడు.బాయ్ ఫ్రెండ్ మరణించిన బాధ నుండి షేహనాజ్ ఇప్పుడప్పుడే బయటకు రాదని అంతా అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఆమె వైఖరితో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.తాజాగా రంజాన్ పండుగ సందర్భంగా సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ ఈద్ పార్టీ ఇవ్వగా అందుకు బాలీవుడ్ ప్రముఖులను కూడా ఆహ్వానించారు.

ఈ క్రమంలో ఈ పార్టీకి బిగ్‌బాస్‌ బ్యూటీ, నటి, సింగర్‌ అయిన షెహనాజ్‌​ గిల్‌ కూడా విచ్చేశారు.

అయితే వచ్చినప్పటి నుండి పార్టీ నుండి వెల్లే వరకు కూడా సల్మాన్ తోనే ఉంటూ ముద్దులు ,హగ్గులతో రచ్చ రచ్చ చేసింది ఈ అందాల తార.అంతమందిలో ఉండి కూడా సల్మాన్ ని పదే పదే హగ్ చేసుకుంటూ, ముద్దు పెట్టుకుని అతడి చేయి విడిచిపెట్టకుండా తిరిగింది, అంతేనా వెళ్ళేటప్పుడు కూడా కండల వీరుడు చేయి పట్టుకుని కారు వరకు వెళ్లి చెంప గిల్లి మరి సెండ్ ఆఫ్ అందుకుంది ఈ సుందరి.దాంతో ఈ వీడియో చూసిన వారం బాయ్ ఫ్రెండ్ చనిపోయి సంవత్సరం కూడా కాకుండానే అప్పుడే పార్టీలు, వేరొకరితో పబ్లిక్ గా ముద్దులతో హంగామాలు ఏంటి అంటూ విమర్శలు విసురుతున్నారు.

అలా బాలీవుడ్ ప్రముఖ సెలబ్రెటీలు అయిన షెహనాజ్ గిల్ మరియు మందిర బేడిలు నెటిజన్ల విమర్శలతో మునిగిపోయారు.అయితే బాలీవుడ్ లో ఇలాంటివి సర్వ సాధారణం అంటున్నారు మరికొందరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube