డైరెక్టర్ విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో రూపొందిన సినిమా జయమ్మ పంచాయితీ.ఈ సినిమా లో సుమ కనకాల కీలక పాత్రలో నటించింది.
అంతేకాకుండా దేవి ప్రసాద్, దినేష్ కుమార్, కదంబాల శాలిని, కొండెపూడి జాయ్, నిఖిత, గణేష్ యాదవ్ తదితరులు నటించారు.ఇక ఈ సినిమాకు ఎం.
ఎం కీరవాణి సంగీతం అందించాడు.బలగ ప్రకాష్ ఈ సినిమాకు నిర్మాత బాధ్యతలు చేపట్టాడు.
అనుష్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించాడు.ఇక ఈ సినిమా ఈ రోజు థియేటర్లో విడుదల కాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
నిజానికి సుమ సినిమా అనటంతో ప్రేక్షకులు కూడా బాగా ఎదురు చూశారనే చెప్పాలి.మరి ఈ సినిమా సుమకు బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.
కథ:
కథ విషయానికి వస్తే.శ్రీకాకుళంకు చెందిన జయమ్మ అనే పాత్రలో నటించింది సుమ.
ఇక ఈమె తన భర్త పిల్లలతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది.ఇక ఆ సమయంలో జయమ్మ భర్త (దేవి ప్రసాద్) అనారోగ్యానికి గురవ్వడంతో జయమ్మకు డబ్బులు అవసరం అవుతాయి.
దీంతో తన సమస్యను పరిష్కరించుకోవడానికి జయమ్మ గ్రామపంచాయతీ కి వెళుతుంది.కానీ ఆ గ్రామ పంచాయతీ అధికారులు వేరే సమస్యలు పరిష్కరిస్తుంటారు.
దాంతో ఆ సమస్య జయమ్మకు ఎలా సంబంధం కలిగి ఉంటుంది.తన సమస్యను గ్రామపంచాయతీ ఎలా పరిష్కరిస్తుంది అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
నటీనటుల విషయానికి వస్తే ఇందులో సుమ పాత్ర బాగా హైలెట్ గా నిలిచింది.జయమ్మ పాత్రలో బాగా అదరగొట్టింది.పైగా తన భాషతో కూడా మరో లెవెల్లో ఆకట్టుకుంది.మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ పరంగా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.పైగా క్వాలిటీ విజువల్స్ కూడా బాగా ఉన్నాయి.
విలేజ్ సెట్ అప్ ను అద్భుతంగా చూపించారు.తక్కువ బడ్జెట్ సినిమా అయినా బ్యాగ్రౌండ్ తో బాగా ఆకట్టుకుంది.
కీరవాణి మ్యూజిక్ ఆకట్టుకుంది.
విశ్లేషణ:
ఈ సినిమాను మంచి పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్ తో మంచి కథతో రూపొందించాడు దర్శకుడు.జయమ్మ పాత్రకు సుమని ఎంచుకోవడంలో దర్శకుడు బాగా న్యాయం చేశాడు.ఇక సుమ తన భాషతో, తన నటనతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుందని చెప్పవచ్చు.సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఒక ఊరిలో ఉన్న అనే ఫీలింగ్ కలుగుతుంది.
ప్లస్ పాయింట్స్:
బ్యాక్గ్రౌండ్ స్కోర్, కీరవాణి మ్యూజిక్, సుమ నటన, కామెడీ, ఎమోషన్స్.
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించింది.
బాటమ్ లైన్:
ఈ సినిమా అనేది ఒక గ్రామం నాటకం లాగా కనిపిస్తుంది.బాగా పల్లెటూరి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.కాబట్టి ఈ సినిమాను ధియేటర్ లో చూసి బాగా ఎంజాయ్ చేయవచ్చు.