ఉద్యోగం పోతేపోనీ... గులాబీ పార్టీలో పనిచేస్తా:ఫీల్డ్ అసిస్టెంట్

సూర్యాపేట జిల్లా: ప్రభుత్వ ఉద్యోగులు పార్టీలకు వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా ప్రజలకుసర్వీస్ చేయాలి.కానీ, సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాయిల సింగారం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్( Srinivas ) నిబంధనలకు నాకు వర్తించవ్…నేనింతే అంటూ అధికార పార్టీ ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా పాల్గొంటూ గురువారం ఏకంగా బీఆర్ఎస్ పార్టీ( BRS ) నిర్వహించిన ప్రెస్ మీట్ ప్రత్యక్షమయ్యారు.

 Even If You Lose Your Job... If You Work In Brs Party: Field Assistant , Brs Par-TeluguStop.com

దీనితో ప్రతిపక్షాలతో పాటు పాత్రికేయులు కూడా అవాక్కయ్యారు.ఈ విషయమై ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ ను చరవాణి ద్వారా సంప్రదించగా ఉద్యోగం పోతేపోనీ బీఆర్ఎస్ లోనే పనిచేస్తానని చెప్పడంవిస్మయం కలిగిస్తుంది.


స్థానిక ఎంపీడీవోను వివరణ కోరగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.ప్రభుత్వ సర్వీస్ లో ఉండి ఓ రాజకీయ పార్టీకి తొత్తుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube