జగన్ బాగా బిజీ ! పరుగులు పెట్టించేస్తున్నారుగా 

వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్( CM YS jagan ) బాగా బిజీ అయిపోయారు.వరుసగా జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తున్నారు.వివిధ సంక్షేమ పథకాల అమలు నిమిత్తం తరచుగా జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు.2024 లో జరగబోయే ఎన్నికల దృష్ట్యా ఇప్పటి నుంచే జగన్ అలర్ట్ గా ఉంటున్నారు.ఇప్పటికే పార్టీ శ్రేణులను ప్రజల్లోకి వెళ్లే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందించారు.ఒక కార్యక్రమం ముగిసిన తర్వాత మరో కార్యక్రమాన్ని అమలు చేస్తూ నిత్యం పార్టీ శ్రేణులంతా జనాలతో మమేకం అయ్యే విధంగా ప్లాన్ చేశారు.

 Jagan Is Very Busy While Making Runs , Jagan ,ap Cm Jagan, Ysrcp, Ap Elections,-TeluguStop.com

వై నాట్ 175 అనే నినాదాన్ని పార్టీ నాయకుల్లో బలంగా వెళ్లే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు.ఏడాదిన్నరగా ప్రజల మధ్య పార్టీ శ్రేణులు ఉండే విధంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తున్నారు.

గడపగడపకు మన ప్రభుత్వం , జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష , సామాజిక సాధికార యాత్రలు, వై ఏపీ నీడ్స్ జగన్ వంటి ఎన్నో కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Janasena, Pavan Kalyan, Pawan Kalyan

ఇదే విధంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకు ఏదో ఒక కార్యక్రమంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జగన్ చేస్తున్నారు.ఇంకా ఎన్నికలకు ఐదు నెలలు మాత్రమే గడువు ఉండడంతో జగన్ అలర్ట్ అవుతున్నారు .పార్టీ బలహీనంగా ఉన్న చోట ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు.ఒకపక్క పార్టీ నాయకులను జనాల్లోకి పంపిస్తూనే , తాను కూడా వరుస కార్యక్రమాలతో బిజీ అయిపోయారు.గతం కంటే దూకుడుగా ముందుకు వెళుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.ఒకపక్క వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రస్తావిస్తూనే మరోవైపు ప్రతిపక్షాల పైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు.తన పర్యటనలో ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Janasena, Pavan Kalyan, Pawan Kalyan

సంక్షేమ పథకాలకు( Welfare schemes ) నిధులను విడుదల చేయడం , అభివృద్ధి కార్యక్రమాల కోసం జిల్లాల పర్యటనకు జగన్ వెళ్తున్నారు.ఒకపక్క వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి గురించి ప్రస్తావస్తూ ప్రతిపక్షాల పైన విరుచుకుపడుతున్నారు.ముఖ్యంగా టిడిపి జనసేన ను టార్గెట్ చేసుకుని జగన్ మరింతగా తన విమర్శలకు పదును వదిలిపెట్టారు.

ఇక టిడిపి జనసేన పొత్తు అంశం పైన విమర్శలు చేస్తూనే తాము ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నామని , ఏ పార్టీతోను తమకు అవసరం లేదని , ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామంటూ జగన్ చేస్తున్న ప్రసంగాలు ప్రజలను, పార్టీ శ్రేణులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.ఈ విధంగా వరుసగా జిల్లాలు, తర్వాత నియోజకవర్గాల పర్యటనలు చేపడుతూ వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో జగన్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube