సూర్యాపేట జిల్లా: పవిత్ర రంజాన్ మాసంలో నెలరోజుల పాటు ముస్లిం సోదర,సోదరీమణులంతా ఉపవాసాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని,అల్లా దయతో ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని,ఇఫ్తార్ విందులు మతసామస్యానికి ప్రతీకలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.ఆదివారం చిలుకూరు మండలంలోని రామాపురం మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముస్లింల పక్షపాతి అని,ముస్లింల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.గత పాలకులు ముస్లింలను ఓటు బ్యాంకుగా చూశారే తప్ప ఏనాడు ముస్లింల బాగోగులను పట్టించుకోలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మసీదులకు, ఈద్గాలకు,కబరిస్తాన్ లకు,పీర్ల కొట్టాల అభివృద్ధికి బడ్జెట్ ను మంజూరు చేసి,వాటిని అభివృద్ధి చేశారన్నారు.మసీదులో ప్రార్థనలు నిర్వహించే ఇమామ్ లకు,మౌజన్ లకు గౌరవ వేతనాలు ఇస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు.
ముస్లింలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు.రంజాన్ పండుగలో ప్రభుత్వ భాగస్వామ్యం,ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా,ప్రభుత్వ ఇఫ్తార్ విందులు ఘనంగా ఏర్పాటు చేస్తామన్నారు.
ముస్లిం సోదరులకు మైనార్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి షేక్ మీరా ఇప్తారు విందు ఇచ్చారు.ఈ సందర్భంగా మసీదు సదర్ రంజాన్ అలీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి,ఎమ్మెల్యేకి దట్టి కట్టి లోనికి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొండా సైదయ్య,జడ్పి కోఆప్షన్ సభ్యులు జానీమియా,టిఆర్ఎస్ నాయకులు ఒంటిపులి నాగరాజు,వనపర్తి లక్ష్మీనారాయణ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ జనార్ధన్,మాజీ జెడ్పిటిసి బట్టు శివాజీ, ఉపేందర్ గౌడ్,గ్రంధాలయ చైర్మన్ రహీం,నాయకులు రహీం,బసవయ్య,అశోక్,పాష,వెంకన్న,కోటేశ్వరరావు,వీరయ్య,బట్టు వెంకటేశ్వర్లు శ్రీనివాస్,సూరయ్య, మైనార్టీ నాయకులు,టిఆర్ఎస్ నాయకులు,ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.







