ప్రస్తుత రోజులలో ఎవరికి కూడా సేఫ్టీ లేకుండా అయిపోయింది.రోడ్డుపైన వెళ్తున్న మహిళలు పైన, ఇళ్లలో ఉండే మహిళల పైన దారుణాలు పాల్పడడంతో పాటు దొంగతనాలు కూడా ఎక్కువగా అయిపోయాయి.
అయితే ఈ క్రమంలో తాజాగా ఒక యువతి అర్ధరాత్రి చాలా విచిత్రంగా పూలకుండిని( Flowerpot ) దుకాణం నుంచి దొంగతనం చేసింది.ఈ క్రమంలో ఆ మహిళతో( Woman ) స్థానికులు గొడవపడి దాడికి ప్రయత్నించినా కానీ ఆమె ఏమి పట్టించుకోకుండా కారులో పూలకుండిని పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే.నోయిడాలోని( Noida ) ఒక ప్రముఖ దుకాణం బయట బీఎండబ్ల్యూ కారు( BMW Car ) వచ్చి ఆగింది.ఇందులో నుంచి ఒక యువతి దిగి దుకాణం ముందు ఉన్న పూల కుండీలో ఒక పూల కుండిని తీసుకొని కార్ డోర్ తెరిచి అందులో పెట్టింది.ఇలా పూలకుండిని దొంగలించడం అక్కడ స్థానికులు గమనించి ఆమెతో గొడవకు దిగారు.
కానీ, ఆమె అవేవీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.అంతేకాకుండా ఆమె సమాధానం విని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఆమె చెప్పిన సమాధానం విషయానికి వస్తే.‘నేను ప్రతిరోజూ ఒక కుండ పూల కుండీ తీసుకెళ్తున్నాను.ఈ మధ్య కాలంలో అదే స్థలం నుంచి మరో రెండు కుండీలు కూడా తీసుకెళ్లాను.భవిష్యత్తులో మరిన్ని కుండీలు దొంగిలిస్తానని’ ఇలా చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురి అయ్యారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ఇది చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందించారు.ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు కామెంట్ చేస్తుండగా.ఆమెను వెంటనే అరెస్టు చేయండని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.