సూర్యాపేట జిల్లా:రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేటలో నిర్మితమౌతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పనులపై రాష్ట్ర పురపాలక మరియు ఐటి శాఖా కేటీఆర్ ప్రశంశల జల్లు కురిపించారు.యావత్ తెలంగాణా రాష్ట్రానికే సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ వెజ్&నాన్ వెజ్ మార్కెట్ రోల్ మోడల్ గా మారనుందన్నారు.
త్వరలో ప్రారంభం కానున్న పట్టణ ప్రగతిపై హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ లోని జెన్కో ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్లు,చైర్మన్లతో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అక్కడ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చూసి ఆశ్చర్య పోయానన్నారు.అటువంటి నిర్మాణం చేపట్టిన మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ,కమిషనర్ రామాంజల్ రెడ్డిలకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
కల్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయంలో జరిగిన సభను ఆయన గుర్తు చేశారు.దసరాలోపు పూర్తి చెయ్యాలంటూ చైర్మన్,కమిషనర్లను ఆయన ఆదేశించారు.
దసరాలోపు పూర్తి అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకుందామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.