సూర్యాపేట జిల్లా: మద్దిరాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామానికి చెందిన హజారీ శ్రీనివాస్(43) గుండెపోటుతో మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న వంట మాస్టర్ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మృతుని కుటుంబానికి ₹10వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుని కుటుంబానికి కావలసిన అన్ని సహాయ సహకారాలు మా సంఘం తరఫున ఉంటాయని తెలియజేశారు.వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వంట మాస్టర్లు సంఘం అధ్యక్షుడు మానేపల్లి లక్ష్మయ్య,ప్రధాన కార్యదర్శి కందుల భిక్షపతి,మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పలువురు వంట మాస్టర్లు పాల్గొన్నారు.