సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంగా మారాక పేట దినదినాభివృద్ధి చెందుతుంది.ఇందులో భాగంగా పట్టణంలో రోడ్ల విస్తరణ,జంక్షన్ల ఏర్పాట్లు అభివృద్ధి చెందుతున్నాయి.
పేట పట్టణీకరణ పెరగడంతో వాహనాల రద్దీ కూడా పెరిగింది.ట్రాఫిక్ ను అదుపులో ఉంచాలంటే పలు ప్రాంతాల్లో జంక్షన్లు అవసరం తప్పనిసరి అయింది.
గతంలో ఉన్న జంక్షన్లను అభివృద్ధి పరచడం,కొత్త వాటిని ఏర్పాటు చేయడంతో పి.ఎస్.ఆర్ సెంటర్,మెయిన్ రోడ్,ఎస్.వి.ఇంజనీరింగ్ కళాశాల,రాఘవ ప్లాజా,కోర్ట్ చౌరస్తా, ఎడ్ల గోపయ్య జంక్షన్లను అభివృద్ధి పరుచుటకు ప్రణాళికలు సిద్ధం చేశారు.ఈ జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి చేసేందుకు జె.ఎన్.టి.యూ కళాశాల ఆర్కి స్ట్రెచర్ విభాగం బృందం శనివారం పేటను సందర్శించింది.వారికి పేట మున్సిపల్ కమీషనర్ పి.రామానుజులరెడ్డి జంక్షన్ అభివృద్ధి ప్రాంతాలను,అభివృద్ధి పనుల వివరాలు తెలియజేశారు.వాటిని పరిశీలించిన బృందం సభ్యులు జంక్షన్ల ఏర్పాట్లకు సంబంధించిన డిజైన్లు త్వరలో పంపిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి,డిఇ సత్యారావు,కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.