ఆంధ్రా నకిలీ ఔషధాల జాడలు కోదాడలో...?

సూర్యాపేట జిల్లా: గత రెండు రోజుల క్రితం విజయవాడలో కొన్ని హోల్ సేల్ ఔషధాల షాపులపై అధికారులు నిర్వహించిన దాడులలో అనేక కంపెనీలకు చెందిన పలురకాల ఔషధాలను నకిలీవిగా గుర్తించగా, వాటిని ఎవరెవరికి సరఫరా చేశారో వివరాలు సేకరించగా కోదాడ పట్టణంలో అధిక విక్రయాలు జరిపే రెండు హోల్ సేల్ దుకాణాలకు సరఫరా చేసినట్లు తేలడంతో గురువారం జిల్లాకు చెందిన ఔషధ నియంత్రణ అధికారులు రెండు షాపులపై మెరుపు దాడులు చేసి,అర్థరాత్రి రెండు గంటల వరకు తనిఖీలు నిర్వహించారని సమాచారం.ఈ సందర్భంగా రోజ్ వాస్-40, చైమోరాల్ ఫోర్ట్, గ్లూకోనార్మ్-జి1 మరియు అనేక ఔషధాలను పరిశీలించగా అప్పటికే వాటిని రిటైలర్లకు అమ్మడంతో

 Traces Of Andhra Fake Drugs In Kodad, Andhra Fake Drugs ,kodad, Fake Medicines,-TeluguStop.com

అదే కంపెనీకి చెందిన పాన్-డి,టెల్మా-40 ఔషధాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించినట్లు తెలుస్తోంది.

అడపా దడపా దాడులు చేస్తున్న అధికారులు ఇప్పటికైనా మేల్కొని నిశితంగా పరిశీలిస్తే నకిలీ ఔషధాల గుట్టు వీడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.దీనిపై జిల్లా డ్రగ్ ఇన్సపెక్టర్ సురేందర్ ను వివరణ కోరగా దాడులు జరిగింది వాస్తవమేనని,ముందు ముందు మరిన్ని దాడులు చేస్తామని అన్నారు.

బిల్లులు లేకుండా ఎవరు ఔషధాలు కొనవద్దని,ప్రతి షాపు యజమాని ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని,లేనియెడల కేసులు నమోదు చేస్తామని,అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube