సూర్యాపేట జిల్లా( Suryapet District ):విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏ స్థాయి అధికారైనా,ఉద్యోగి అయినా చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ( Suryapet District Collector S.
Venkatarao )హెచ్చరించారు.గురువారం జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) సిహెచ్.
ప్రియాంకతో కలిసి ఆయన అధికారులతో వెబేక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఏ ప్రభుత్వ శాఖకు చెందినవారైనా నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని, ఎవరికీ ఎటువంటి మినహాయింపులు లేవన్నారు.
కలెక్టరేట్ కార్యాలయంలోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమకు కేటాయించిన విధులను సమయపాలన పాటిస్తూ, విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని తెలిపారు.
సక్రమంగా పనిచేసేవారిని ప్రోత్సహిస్తామని, విరుద్ధంగా వ్యవహరిస్తే శాఖ పరమైన చర్యలు చేపడతామన్నారు.
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి( Outsourced employee ) విధులకు హాజరు కావడంలేదని జాయింట్ కలెక్టర్ పరిశీలనలో వెల్లడి కాగా ఆ శాఖకు చెందిన జిల్లా అధికారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందని,ఏ అధికారిని ఉపేక్షించేది లేదని, ఇకనుండి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, అన్ని శాఖల సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కోరారు.అధికారులు పనితీరు మార్చుకొని విధుల పట్ల బాధ్యతయుతంగా పనిచేయాలని సూచించారు.