సూర్యాపేట జిల్లా:నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీకి చెందిన రాంబాబు(26) గత కొన్నిరోజులుగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో బంధువుల ఇంట్లో ఉంటున్నాడు.ఇతనికి ఇటీవలే బ్రెయిన్ సర్జరీ జరిగి తలకి కట్టు కూడా వుంది.
మంగళవారం నేరేడుచర్లలో బంధువుల ఇంటి నుండి బయటికి వెళ్లి తిరిగి రాలేదు.
నలుపు రంగులో ఉండే ఇతను ఆకుపచ్చ ప్యాంట్, తెలుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడు.
ఆచూకీ తెలిసినవారు నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ లేదా 6304217432,9177549676 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.