సూర్యాపేట జిల్లా:మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కళ్లెం సుభాని తండ్రి లాలయ్య ఇంటి వెనుక భాగంలో గంజాయి మొక్కలు పెంచుతున్నారన్న పక్కా సమాచారంతో
మేళ్లచెరువు సీఐ రజితారెడ్డి ఆధ్వర్యంలో ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా గంజాయి మొక్కలు లభ్యమయ్యాయి.గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించామని సిఐ తెలిపారు.