పింపుల్స్ డార్క్ స్పాట్స్ కి చెక్ పెట్టాలంటే.. ముల్తాన్ మట్టితో ఇలా చేయండి..!

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరి ముఖం అందంగా ఉండాలని కోరుకుంటున్నారు.దాని కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.

 To Check Pimples Dark Spots Do This With Multani Mitti , Dark Spots , Gram F-TeluguStop.com

అంతే కాకుండా మార్కెట్ లో లభించే ఎన్నో రకాల కాస్మోటిక్స్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే చర్మా సౌందర్యానికి ముల్తాన్ మట్టి ఎంతో అద్భుతంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా మారడమే కాకుండా చర్మంలో తేమ ఉండేలా చేస్తుంది.అయితే ఏ చర్మ సమస్యలకు ముల్తాన్ మట్టి( Multani Mitti )ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే కాంతివంతమైన చర్మం కోసం ప్యాక్ ను ఇలా తయారు చేసుకోవాలి.ఒక బౌల్ లో మూడు స్పూన్ల ముల్తాన్ మట్టి, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ కిర దోశ గు( Cucumber )జ్జు, రెండు స్పూన్ల శెనగపిండి( Gram flour ), ఒక స్పూన్ పాలు వేసి బాగా కలపాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖనికి పట్టించి 15 నిమిషముల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇలా వారానికి మూడు నుంచి నాలుగు సార్లు చేస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

ఇంకా చెప్పాలంటే ముఖముbపై ఉన్న బ్లాక్ హెడ్స్ సమస్య దూరం చేసుకోవాలనుకుంటే రెండు స్పూన్ల ముల్తాన్ మట్టి, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు తర్వాత గోరు వెచ్చని నీటి తో శుభ్రం చేసుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య దూరం అవుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే మార్కెట్ లో లభించే ఉత్పత్తులను ఉపయోగించకుండా ఇంట్లోనీ ఈ చిట్కాలతో ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube