మీ చేతులలో నుంచి చిన్న చిన్న వస్తువులు కూడా కింద పడిపోతున్నాయా? అయితే ఈ సమస్య కావచ్చు..!

ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.తినే ఆహారం, జీవన శైలి తదితర కారణాలవల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

 Do Even Small Objects Fall Out Of Your Hands But This Could Be A Problem , Gene-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే మీ చేతులు పట్టు తప్పిపోతున్నాయా, అయితే మీరు త్వరలోనే అనారోగ్య సమస్యకు గురవుతారని భావించాలి.మీ చేతుల్లోంచి తరచూ వస్తువులు జారీ కింద పడిపోతున్నాయా, అయితే మీరు గుండెకు సంబంధించన, నాడీ వ్యవస్థకు,నరాల పటుత్వానికి సంబంధించిన అనారోగ్యానికి గురవుతారని అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా ఇలా చెయ్యి పట్టు చిక్కకపోవడాన్ని, పట్టు జారిపోవడాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు.తరచూ చేతుల్లోంచి చిన్న చిన్న వస్తువులు కూడా జారి కింద పడిపోవడాన్ని కూడా ఎవరు పట్టించుకోరు.

కానీ మీ శరీరానికి సంబంధించిన అనేక రకాల రుగ్మతలకు, అనారోగ్యా సమస్యలకు ఇలా పట్టు జారిపోవడాన్ని సూచనగా భావించాలని చెబుతున్నారు.ఈ మధ్యకాలంలో జనరల్ ఆఫ్ ఆల్జీమర్స్( General of Alzheimer’s ) లో ప్రచురితమైన ఒక ప్రత్యేకమైన అధ్యయనం ప్రకారం ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

మీ చేతిలో పట్టు తప్పిపోవడం, పట్టు జారిపోవడం త్వరలోనే మీకు చిత్తవైకల్యానికి సంబంధించిన జబ్బులు రావడానికి సూచనగా భావించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

Telugu Tips, Muscle Mass-Telugu Health Tips

30 సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి సాధారణంగా కనీసం 40 కేజీల బరువును సులభంగా మోయగలడు.దానిపై తనకు కచ్చితంగా పట్టు ఉంటుంది.ఈ సామర్థ్యం ఎంతో కొంత తగ్గినా సరే ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో అనారోగ్యానికి సంకేతం అని వైద్యులు చెబుతున్నారు.

దాదాపు ప్రతి మనిషికి ఒక శతాబ్దానికి మూడు నుంచి ఐదు శాతం మజిల్ మాస్ పవర్( Muscle mass power ) తగ్గిపోతుందని వైద్య విజ్ఞాన శాస్త్రవేత్తలు ( Medical scientists )వెల్లడించారు.శరీరంలోని మిగతా అవయవాల పట్టుత్వం కోసం రోజు వ్యాయామం చేసే వాళ్లే తప్ప,చేతుల మణికట్టులోని కండరాల పటుత్వాన్ని పెంచుకోవడానికి వ్యాయామం చేసే దాదాపు చాలా తక్కువే అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కేవలం చిన్నచిన్న గ్రిప్పులు, స్మైలీ బాల్స్ సహాయంతో రోజు కొంతసేపు ప్రత్యేకంగా చేతి కండరాలను బలపరుచుకునేందుకు వ్యాయామం చేయడం ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube