ఈ రెండు పదార్థాలతో చుండ్రును ఈజీగా పోగొట్టుకోవచ్చు.. తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అత్యధికంగా వేధించే సమస్యల్లో చుండ్రు ముందు వరుసలో ఉంటుంది.రెగ్యులర్ గా షాంపూ చేసుకోవడం, వేడి వేడి నీటితో తల స్నానం చేయడం, వాతావరణంలో వచ్చే మార్పులు తదితర కారణాల వల్ల చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

 With These Two Ingredients You Can Get Rid Of Dandruff Easily Details! Dandruff,-TeluguStop.com

చుండ్రును నివారించుకోవడం కోసం చాలా మంది ఖరీదైన షాంపూలను వాడుతుంటారు.కానీ షాంపూ తో చుండ్రు పోతుంది అనుకుంటే పొరపాటే.

అయితే ఇప్పుడు చెప్పబోయే రెండు పదార్థాలతో చుండ్రును ఈజీగా పోగొట్టుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెండు పదార్థాలు ఏంటి.? వాటిని ఎలా జుట్టుకు ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.

Telugu Dandruff, Dandruffremoval, Care, Care Tips, Fall, Long, Reduce Dandruff-T

అలాగే ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్ ఆయిల్ ను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్‌ చేసుకున్న‌ మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ ను స్కాల్ప్ కు దూది సహాయంతో ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకోవాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్‌ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.

Telugu Dandruff, Dandruffremoval, Care, Care Tips, Fall, Long, Reduce Dandruff-T

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటించాలి.తద్వారా ఉల్లిపాయ మరియు కలోంజి సీడ్ ఆయిల్ లో ఉంటే ప్రత్యేక సుగుణాలు చుండ్రును పూర్తిగా నివారించి స్కాల్ప్ ను ఆరోగ్యంగా, శుభ్రంగా మారుస్తాయి.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్ గా మారి హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.కాబట్టి హెయిర్ ఫాల్ మరియు చుండ్రు సమస్యలతో బాధపడుతున్న వారు కచ్చితంగా ఈ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube