ఏపీలో అధికార వైసీపీకి సంబంధించి రోజుకో చర్చ తెరపైకి వస్తోంది.ఓవైపు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ పార్టీలో రేగుతున్న అసంతృప్త జ్వాలలు జగన్ తీవ్రంగా కలవరపరుస్తున్నాయి.
మొన్న ఆనం రామనారాయణ రెడ్డి నిన్న కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.తరువాత ఉండవెల్లి శ్రీదేవి, మేకపాటి.
ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇలా వైసీపీ కీలక పాత్ర పోషించిన నేతలంతా ఒక్కొక్కరుగా అసంతృప్తి వెళ్లగక్కుతూ పార్టీ నుంచి నిస్క్రమిస్తున్నారు.ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైసీపీని కలవరపెడుతున్నారు.
ఈ విధంగా నేతలు ఒక్కొక్కరుగా దూరం కావడానికి అసలు కారణం ఎంటనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ గా సాగుతున్న చర్చ.
కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి( Kotamreddy Sridhar Reddy ), ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్లు ఏకంగా జగన్ వైపే వేలెత్తి చూపారు.జగన్ వైఖరి తమకు నచ్చట్లేదని బహిరంగంగానే వాపోయారు.ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని, కొందరి అధీనంలోనే పార్టీ కార్యకలాపాలు సాగుతున్నాయని ఏకంగా కో ఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకొని కంటతడి పెట్టారు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా వైసీపీకి టాటా చెబుతారా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి.పార్టీలో కూడా ఇదే కలవరం మొదలైందట.
వైఎస్ రాజశేకర్ రెడ్డి హయం నుంచి వైఎస్ ఫ్యామిలీతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivasa Reddy ).జగన్ మొదటి క్యాబినెట్ లో కూడా మంత్రిగా పని చేశారు.అయితే రెండవసారి క్యాబినెట్ మార్పులో ఆయనకు చోటు దక్కలేదు.దాంతో అప్పటి నుంచి బాలినేని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనేది కొందరి వాదన.అయితే పార్టీలో జరిగిన కుట్రల కారణంగానే బాలినేనిపై ఉద్వాసన పడిందనేది ఆయన వర్గం చెబుతున్న మాట.
అయితే ఆయన చెప్పినట్లుగా వైసీపీలో కుట్రలు జరుగుతుంటే అవి జగన్ ( YS Jagan Mohan Reddy )కు తెలియట్లేదా ? ఒకవేళ ఆనం, కోటంరేడ్డి చెబుతున్నట్లుగా అధినేత జగన్ వైఖరే కారణం ఇలా రకరకాల సందేహాలు తెరపైకి వస్తున్నాయి.ప్రస్తుతం తీవ్ర అసంతృప్తిలో ఉన్న బాలినేని వైసీపీ విడితే.ఆ పార్టీకి గట్టి దెబ్బతగిలినట్లే.
ఇక 40 నుంచి 50 మంది దాకా ఎమ్మేల్యేలు వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారని బయటకు వచ్చిన నేతలు ఇప్పటికే చెప్పుకొచ్చారు.ఆ రకంగా చూస్తే బాలినేని పార్టీ నుంచి బయటకు వస్తే మరికొంత మంది నేతలు కూడా పార్టీపై జగన్ వైఖరి పై అసంతృప్తి గళం వినిపించే అవకాశం ఉంది.
మొత్తానికి ఎన్నికల వేళ ఎదురవుతున్న తిరుగుబాటు వైసీపీకి నష్టం కలిగించే అంశమే.