1.కెసిఆర్ కు తప్పిన పెను ప్రమాదం
ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర సభకు హాజరయ్యేందుకు తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది .దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ మార్గమధ్యం నుండి తిరిగి వ్యవసాయ క్షేత్రానికి హెలికాప్టర్ ను మళ్ళించి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.
2.ఏపీలో దీపావళి సెలవు మార్పు
ఏపీలో దీపావళి సెలవు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.గతంలో ప్రకటించిన 12 వ తేదీ సెలవును 13వ తేదీకి మారుస్తూ ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
3.తెలంగాణకు ప్రధాని మోది
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 7వ తేదీన హైదరాబాద్ పర్యటనకు షెడ్యూల్ ఖరారు అయింది.
4.రేవంత్ రెడ్డి నామినేషన్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
5.మరోసారి ఆసుపత్రికి చంద్రబాబు
మరోసారి గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రికి టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు వెళ్లారు.
6.కేఏ పాల్ కామెంట్స్
రాహుల్ గాంధీ నాకు ఫోన్ కాల్ చేసి మద్దతు అడిగారని, కానీ ఇవ్వను అని చెప్పానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
7.బండి సంజయ్ సంచలన కామెంట్స్
నేను రాజాసింగ్ ధర్మం కోసం చావడానికి అయినా సిద్ధమని , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
8.కెసిఆర్ పై జగ్గారెడ్డి విమర్శలు
తెలంగాణ సీఎం కేసీఆర్ 9 కిస్తీల ముఖ్యమంత్రి అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.
9.కెసిఆర్ పై షర్మిల విమర్శలు
సీఎం కేసీఆర్ అపర మేధావి ఫీల్ అవుతున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
10.చార్మినార్ ఎమ్మెల్యే పై కేసు నమోదు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ , అతని కుమారుడు డాక్టర్ ఇంతియాజ్ పై మొగల్పుర పోలీసులు కేసు నమోదు చేశారు.
11.శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
ఈనెల 12వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు జరగనుంది.
12.ఆర్టీసీ ఉద్యోగులకు జిపిఎస్ అమలు
ఆర్టీసీ ఉద్యోగులకు జిపిఎస్ అమలు చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ డైరెక్టర్ ఏ రాజారెడ్డి తెలిపారు.
13.నరేంద్ర కుమార్ కు జాయితీ స్థాయి అవార్డు
శిశు శస్త్ర చికిత్స వైద్యానికి డాక్టర్ ఏ నరేంద్ర కుమార్ భారతీయ పీడియాట్రిక్ సర్జన్ సంఘం జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు.
14.రైతు భరోసా నిధుల విడుదల
వైయస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్ నిధులను సీఎం జగన్ ఈనెల 7న సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగే బహిరంగ సభలో రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.
15. విజయవాడ బస్సు ప్రమాదంపై పురంధరేశ్వరి కామెంట్స్
ఏపీలోని అతిపెద్ద బస్ స్టాండ్ లో బస్సు ప్రమాదం ఆందోళనకు గురిచేసిందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అన్నారు.
16.ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సభ్యుల నియామకం
ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ కమిటీని పర్యావరణ అటవీశాఖ పునర్ నియమించింది.
17.కొత్తపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి సమావేశంలో ప్రమాదం
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పరిధిలోని కొత్తపల్లి లో కాంగ్రెస్ అభ్యర్థి ఒడితల ప్రణవ్ ఎన్నికల ప్రచారం లో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది.
మహిళల మధ్యలో నిల్చుని ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా టపాసులు మీద పడ్డాయి.ఈ ఘటనలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.
18.రాహుల్ ఛాలెంజ్ కు కేటీఆర్ స్పందన
దొరల తెలంగాణ కావాలా ప్రజల తెలంగాణ కావాలని కాంగ్రెస్ దగ్గరనే రాహుల్ గాంధీ అడుగుతున్నారని , ఆయన చాలెంజ్ కు తాను సిద్ధమని ఢిల్లీ ధరలకు తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవ్వని కేటీఆర్ అన్నారు.
19.గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి
రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందిన బిల్లులను ఎటు తేల్చకుండా వాటి విషయంలో గవర్నర్లు నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.ఇటువంటి సంస్కృతికి ముగింపు పలకాలని సూచించింది .పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు విషయంలో గవర్నర్ బనవారీలాల్ పురోహిత్ ఆమోదం తెలపకుండా ఆలస్యం చేస్తుండడం పో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
20.కెసిఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు
2009లో కరీంనగర్ నుంచి కేసీఆర్ పారిపోయి పాలమూరుకు వస్తే మేము కడుపులో పెట్టుకుని గెలిపించామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.