ముఖ చర్మం సాగినట్లు అనిపిస్తుందా.. అప్పుడే ముడతలు వచ్చేశాయా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

ముడతలు, చర్మం సాగటం.అనేవి వృద్ధాప్యానికి సంకేతం.

 Simple Remedies To Get Rid Of Wrinkles And Skin Stretching! Wrinkles, Skin Stret-TeluguStop.com

వయసు పైబడిన వారిలో ఇటువంటి వృద్ధాప్య ఛాయలు కనిపించిన పెద్దగా కలవర పడాల్సిన అవసరం లేదు.కండరాల పటుత్వం కోల్పోయి ఇలా జరుగుతుంటుంది.

కానీ ఇటీవల రోజుల్లో 30 ఏళ్ల వారు సైతం వృద్ధాప్య ఛాయలను ఎదుర్కొంటున్నారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? ముఖ చర్మం సాగినట్లు అనిపిస్తుందా.? అప్పుడే ముడతలు వచ్చేశాయా.? డోంట్ వర్రీ.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ పాటిస్తే మళ్లీ మీ చర్మం యవ్వనంగా మెరిసిపోతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక చిన్న అరటి పండు( Banana ) తీసుకుని స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.

మిక్సీ జార్ లో ఈ అరటిపండు స్లైసెస్ తో పాటు వన్ టేబుల్ స్పూన్ ఆముదం, నాలుగైదు టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ( Green tea ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మాయిశ్చరైజ‌ర్ రాసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే ముడతలు మాయం అవుతాయి.

సాగిన చర్మం టైట్ గా మారుతుంది.మరియు స్కిన్ టోన్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.

Telugu Tips, Latest, Skin Care, Skin Care Tips, Skin, Skin Remedy, Wrinkles-Telu

ఎగ్ వైట్ కూడా వృద్ధాప్య ఛాయాలను దూరం చేస్తుంది.ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్ వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive oil ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఒకటికి రెండుసార్లు ముఖానికి మెడకు పూతలా అప్లై చేయాలి.

పూర్తిగా ఆరిన తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా చేసిన సాగిన చర్మం బిగుతుగా మారుతుంది.

ముడతలు క్రమంగా మాయం అవుతాయి.చర్మం గ్లోయింగ్ గా మెరుస్తుంది.

Telugu Tips, Latest, Skin Care, Skin Care Tips, Skin, Skin Remedy, Wrinkles-Telu

వృద్ధాప్య ఛాయల‌కు చెక్ పెట్టే సామర్థ్యం బొప్పాయి పండుకు( papaya fruit ) పుష్కలంగా ఉంది.ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు ప్యూరీ, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చ‌ర్మాన్ని మెల్లగా రుద్దుతూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసిన కూడా ముడతలు దూరమవుతాయి.సాగిన చర్మం టైట్ గా బ్రైట్ గా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube