కొందరి పేరు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.వారి మాటలు, చేష్టల కారణంగా నిత్యం వార్తల్లోకి ఎక్కుతారు.
పాజిటివ్.నెగెటివ్ అనే విషయాలను పక్కన పెడితే ట్రోల్స్, గాసిప్స్ కారణంగా వీరిపై చర్చోపచర్చలు జరుగుతాయి.
అదే వారికి లాభాన్ని చేకూర్చుతుంది.మంచి అవకాశాలు వారి ముందు వచ్చి వాలుతున్నాయి.
సెలబ్రిటీలుగా చలామణి చేస్తాయి.ఇంతకీ సోషల్ మీడియాలో మీమ్స్ గా మారుతున్న ఆ పర్సన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం!
ఆర్జీవీ:నీకు ఏ సిటీ అంటే ఇష్టం అని అడిగితే పబ్లిసిటీ అని చెప్పే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ.డైరెక్టర్ గా మారిన తర్వాత కొన్ని సినిమాలు బాగానే తీసినా.ఆ తర్వాత రూటు తప్పాడు.
నిత్యం కాంట్రవర్సీ ట్వీట్స్ తో సోషల్ మీడియాలో వీరంగం చేస్తారు.ఆయనను మెచ్చుకునే వారు కొందరైతే.
తిట్టేవాళ్లు మరికొందరు.ఎలాగైతేనేం పక్కవారిని గెలికే ఈ లక్షణమే ఆయనను నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తిగా చేస్తుంది.
మంచు లక్ష్మి:
ఈమె మాట్లాడే తెలుగు, ఇంగ్లీష్ కడుపుబ్బా నవ్విస్తాయి.తన పిచ్చి పలుకుడు కారణంగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.R…Should be rolled ….కిందపడి దొర్లాలంతే.లాంటి ఆణిముత్యాలు కోకొల్లలు ఈమె నోటివెంట వస్తాయి.పలురకాల మిమ్స్ తో నిత్యం నెట్టింట్లో హంగామా చేస్తుంది ఈ కలెక్షన్ కింగ్ డాటర్.
ఓంకార్:
జీ తెలుగులో డ్యాన్స్ షో ద్వారా పరిచయం అయిన ఈ యాంకర్.ఆ తర్వాత కొన్ని సినిమాలను కూడా తెరెక్కించాడు.ఆయన వాయిస్ కాస్త వెరైటీగా ఉంటుంది.అదే మిమిక్రీ ఆర్టిస్టులకు లాభం చేకూర్చింది.పలువురు ఆయన వాయిస్ ఇమిటేట్ చేసి మంచి పేరు పొందారు.ఓంకార్ మీద వచ్చేట్రోల్స్, మీమ్స్ తనను నిత్యం వార్తల్లో ఉంచుతున్నాయి.
సుడిగాలి సుధీర్:
జబర్దస్త్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చాడు ఈ కమేడియన్.ఆ షో యాంకర్ రష్మీతో ఇతడికి ఏదో డ్యాష్ డ్యాష్ ఉందని గాసిప్స్ వెళ్లువెత్తాయి.తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని.అదంతా కేవలం ప్రోగ్రాంలో భాగంగా చేశామని చెప్పినా జనాలు పట్టించుకోవడం లేదు.అయినా ఏవో గుసగుసలు వస్తూనే ఉన్నాయి.అవే వారికి లాభాన్ని చేకూర్చాయి.
పలు టీవీ షోలలో ఆఫర్లు వచ్చాయి.ఈ ఇద్దరూ కలిసి చేసిన షోలు మస్త్ రేటింగ్‌తో దూసుకుపోతున్నాయి.
మొత్తంగా తమపై వచ్చే గాసిప్స్ వీరి ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయి.
శ్రీరెడ్డి:
కాస్టింగ్ కౌచ్ అంశంతో ముందుకు వచ్చి.మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ముందు బట్టలు విప్పి నిరసన తెలపడంతో శ్రీరెడ్డి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.చేసింది ఒకటి, అర సినిమాలే అయినా.
సోషల్ మీడియాలో ఆమె అంగాంగ ప్రదర్శన.అడ్డూ అదుపూ లేని బూతులు ఆమెను సోషల్ మీడియాలో నిలబెడుతున్నాయి.
కత్తి మహేష్:
పవన్ కల్యాణ్‌పై ఒంటికాలుపై లేచే ఈ వ్యక్తి.ఆ తర్వాత బిగ్ బాస్‌లోకి వెళ్లి ఫేమస్ అయ్యాడు.నిత్యం పీకేను టార్గెట్ చేసే ఈయన.పవర్ స్టార్ అభిమానులకూ టార్గెట్ అయ్యాడు.ఓసారి వారు ఇతడిపై దాడి కూడా చేశారు.కొద్ది రోజుల పాటు హైదరాబాద్ పోలీసులు ఇతడిని సిటీ నుంచి బహిష్కరించారు.
నిత్యం ఏదో ఓ కామెంట్ చేస్తూ ఇతడు వార్తల్లో ఉంటున్నాడు.