హిందూ సాంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది.వాస్తవానికి పెద్దలు చాలా ఆలోచించి చెబుతారు.
హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రకారం అన్ని సరైనదిగానే ఉంటే ఇల్లు సుఖసంతోషాలతో ఉంటుంది.ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, ఆటంకాలు, అనారోగ్య సమస్యలు, తగాదాలు, గొడవలు ఇలా ఇంట్లో శాంతి కరువు అవుతుంది.
అయితే కొన్ని మొక్కలు కీడు కోరుకుంటాయని పెద్దలు చెబుతారు.అలాగే కొన్ని మొక్కలు మంచి కూడా కోరుకుంటాయి అని చెబుతారు.
అయితే ఆ మొక్కలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చంపా మొక్క:( Champa plant ) ఈ మొక్క ఇంట్లో ఉంటే ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీని ఆనుకుంటుంది.దీంతో కుటుంబ సభ్యులు మధ్య గొడవలు, తగాదాలు ఉండవు.ఇక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి.దీంతో ఇంట్లో శాంతి నెలకొంటుంది.ఇక ఈ మొక్క గాలిని ఎక్కువ ప్యూరిఫై చేయగలదు.
ఈ మొక్క ఇంట్లో ఉంటే అక్కడ ఆరోగ్యకరమైన గాలి వస్తుంది.
మల్లె మొక్క: ( jasmine plant )ఈ మొక్క మంచి సువాసన వెదజల్లుతుంది.అంతేకాకుండా మల్లెపూలు అంటే లక్ష్మీదేవి( Goddess Lakshmi ) అమ్మవారికి ప్రీతికరం అని చెబుతూ ఉంటారు.కాబట్టి ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
అలాగే ఈ మొక్క మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.

పారిజాత మొక్క:( Parijata plant ) పారిజాత మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిది.ఇది ప్రతి కోరికను తీర్చుతుంది.ఈ మొక్క శ్రీకృష్ణుడికి( Lord Krishna ) అత్యంత ప్రీతికరమైన మొక్క.
ఈ మొక్క మానసిక ఒత్తడిని, ఆందోళనను తగ్గిస్తుంది.అలాగే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తుంది.
అదేవిధంగా ఈ మొక్క నారాయణుడికి చాలా ఇష్టమైన చోటు అని చెప్పవచ్చు.కాబట్టి ఈ మొక్క ఎక్కడుంటే అక్కడ నారాయణుడు కొలువుంటాడని అందరూ నమ్ముతారు.

కాబట్టి ఈ మొక్కలు మన ఇంట్లో ఉండడం చాలా మంచిది.అయితే కొన్ని మొక్కలు మాత్రం ఇంట్లో కీడుని శంకిస్థాయి.కొన్ని రకాల ముళ్ళు కలిగిన మొక్కలను ఇంట్లో పెంచుకోవడం మంచిది కాదు.ఇవి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని పంపిస్తాయి.కాబట్టి ముల్లులు ఉన్న కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోకపోవడమే మంచిది.
DEVOTIONAL