ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.46
సూర్యాస్తమయం: సాయంత్రం.5.43
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: భరణి మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32
మేషం:

ఈరోజు మీరు కొత్త వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఆలోచించండి.దీని వల్ల భవిష్యత్తులో లాభం ఉంటుంది.దీని గురించి మీ తల్లదండ్రులకు చెప్పి సలహాలు తీసుకోవడం మంచిది.కొత్త విషయాల గురించి ఈరోజు అనుకూలంగా గా ఉంటుంది.మీ జీవిత భాగస్వామితో సమయం గడపుతారు.
వృషభం:

ఈరోజు సాయంత్రం వరకు ఆర్థికంగా మెరుగు పడుతారు.తెలిసిన వారితో ఆహ్లాదంగా గడుపుతారు.ఏదైనా పనుల్లో ముందుండి విజయం సాధిస్తారు.
కొన్ని విషయాల్లో మీకు ఈ రోజు అనుకూలంగా ఉంది.మీరు చేసే పనిలో ఆసక్తి లేకున్నా చురుకుగా పాల్గొంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
మిథునం:

ఈరోజు మీ వ్యాపారంలో నష్టాలు వస్తాయి.మీ వ్యాపారానికి సంబంధించిన విషయం లో ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.మీరు ఇతరులతో మాట్లాడినప్పుడు అలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది.
కొన్ని పనులు కష్టం తో చేయడం వల్ల ప్రశంసలు అందుకుంటారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
కర్కాటకం:

ఈరోజు కొన్ని విషయాల వల్ల మానసికంగా ఇబ్బంది పడుతారు.ఈ రోజు మీ కుటుంబ సభ్యుల తో సమయాన్ని కేటాయించడం వల్ల కాస్త ఒత్తిడి నుండి బయట పడుతారు.కొన్ని పనుల వల్ల ఒత్తిడి కలుగుతుంది.ఈరోజు మీ జీవిత భాగస్వామి తో కొన్ని ఆర్థిక పరమైన గొడవలు జరుగుతాయి.
సింహం:

ఈరోజు వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే టప్పుడు ఒక సారి ఆలోచించి విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలి.సానుకూల ఆలోచనతో పనిచేస్తారు.మీరు ఎంచుకున్న ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తారు.ఎప్పటికీ ఇతరులపై నమ్మకం పెట్టకోకపోవడం మంచిది.
కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహకారం అందుతుంది.ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
తుల:

ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి.ఏదో ఒక విషయంపై మీ జీవిత భాగస్వామితో గొడవలు పడే అవకాశాలున్నాయి.మీ పనిపట్ల శ్రద్దను పెడితే మంచి ఫలితాలను పొందవచ్చు.లేక పోతే వైపరిత్యాలకు దారి తీస్తుంది.మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ కుటుంబం నుంచి అందకపోవచ్చు.
వృశ్చికం:

ఈరోజు జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడనుంది.ఈరోజు మీకు గుర్తిండిపోయేలా గడుపుతారు.వ్యాపార విషయాల్లో విజయాన్ని అందుకుంటారు.
ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.ఇంటి అవసరాలను తీరుస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
ధనుస్సు:

ఈరోజు మీరు కొత్త ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది.గతంలో ఏర్పడిన సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికను పూర్తిచేసుకంటారు.
రుణాలు ఇవ్వడం మానుకుంటే మంచిది.సంతానం గురించి మంచి శుభవార్తలు వింటారు.కుటుంబ సంబంధాలు గట్టిపడతాయి.
మకరం:

ఈరోజు మీకు పనిపట్ల మీకు నూతన అవకాశాలు వచ్చే అవకావాలున్నాయి.విజయం సాధించేందుకు మీ వంతు ప్రయత్నాలు చేస్తారు.బంధాలను వ్యక్తపరిచేందుకు సమయం మంచిది.
పాత జ్ఞాపకాలను మరిచిపోవడం మూలంగా మనస్సుకు హాయి కలుగుంది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
కుంభం:

ఈ రోజు మీరు చేసే పనులే భవిష్యత్తలో మీకు ఎంతో ఉపయోగపడతాయి.వ్యాపార విషయాల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తారు.కొన్ని సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితులు ఎదురు కావొచ్చు.ప్రేమ లో గడపటం వల్ల మీరు సంతోషంగా గడుపుతారు.మీ పట్ల నటిస్తున్న వారికి దూరంగా ఉండటం మంచిది.
మీనం:

ఈరోజు మీ జీవితంలో నూతన మార్పులు సంభవించే అవకాశముంది.ప్రభుత్వం నుంచి గౌరవం పొందుతారు.మీ పనితీరును మెరుగుపరుచుకుంటారు.
అత్త మామల నుంచి పూర్తి సహకారం అందుకుంటారు.జీవిత భాగస్వామి నుంచి ప్రేమను పొందుతారు.
చాలా సంతోషంగా ఉంటారు.
DEVOTIONAL








