ఉసిరికాయలు.వీటి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.
ఉసిరికాయలు ( Amla )అపారమైన పోషకాలతో పాటు అనేక ఔషధ గుణాలను సైతం కలిగి ఉంటాయి.అందుకే ఉసిరికాయలను ఆయుర్వేద వైద్యంలోనూ వాడతారు.
అయితే ఉసిరికాయలను రోజు ఉదయం ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి.ఎన్నో ఊహించని హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

ముందుగా నాలుగు లేదా ఐదు ఉసిరికాయలను ( Amla )తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే అర అంగుళం అల్లం ముక్క( Ginger )ను తీసుకుని పీల్ తొలగించి పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకోవాలి.అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె ( Honey )కలిపి సేవించాలి.

ఈ విధంగా ఉసిరికాయ జ్యూస్ తయారు చేసుకుని రోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే చాలా ప్రయోజనాలు పొందుతారు.ఉసిరికాయల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.అది మన కంటి చూపు రెట్టింపు చేస్తుంది.
ఉసిరికాయల్లో ఉండే ఫైబర్ మన జీర్ణవ్యవస్థను ( Digestive system )చురుగ్గా మారుస్తుంది.విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.
అంతేకాదు పైన చెప్పిన విధంగా ఉసిరికాయలతో జ్యూస్( AmlaJuice ) తయారు చేసుకునే ఖాళీ కడుపుతో తీసుకుంటే మోకాళ్ళ నొప్పులకు దూరంగా ఉండవచ్చు. ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తగ్గుముఖం పడతాయిజ అలాగే ఉసిరికాయ జ్యూస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేయడానికి ఎఫెక్టివ్ గా హెల్ప్ చేస్తుంది.
ఇక ఉసిరికాయ జ్యూస్ ను రోజు ఉదయం తాగడం వల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.చర్మం హెల్తీగా హైడ్రేటెడ్ గా గ్లోయింగ్ గా మెరుస్తుంది.
.