ఈ రోజే భీష్మ ఏకాదశి.. విష్ణుసహస్రనామాలు పారాయణం చేస్తే విజయం మీదే..

మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతికరమైన మహాపర్వం.భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని ‘భీష్మ ఏకాదశి” అని పిలుస్తారు.

 Bheeshma Ekadashi Special Story, Bheeshma Ekadashi , Bheeshmudu , Devotional, Te-TeluguStop.com

కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీదన ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి.అందుకే దీనిని విష్ణు సహస్ర నామ జయంతి అని కూడా పిలుస్తుంటారు.

ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే ఈ రోజు కూడా వర్తిస్తాయి.దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకూ ఉపవాసం ఉండాలనీ, ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయమనీ పెద్దలు సూచిస్తారు.

దీంతోపాటుగా విష్ణు పూజకు విశేష ప్రాధాన్యత ఉంది.భీష్ముడు అందించిన విష్ణు సహస్ర నామాలను ఈరోజున పటిస్తే, విశేష ఫలితం దక్కుతుంది.

భగవద్గీతను పఠించడానికి ఇది అనువైన రోజు. భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు.

ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయ వంతం అవుతుందని నమ్మకం, ఈ రోజున శ్రీ మహా విష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. ముఖ్యంగా భీష్మ ఏకాదశి రోజు గొడుగు, పాదరక్షలు, రాగి వస్తువులు దానం చేస్తే.

జాతక దోషాలు తొలగి పోతాయని పెద్దలు అంటారు.అన్నదానం చేస్తే.

ఎంతో మేలు.భీష్మఏకాదశి రోజు విష్ణు సంబంధిత ఆలయాలకు వెళ్లి, చేతిలో అక్షితలు, పుష్పాలు పట్టుకొని ఒక్కో ప్రదక్షిణకు మీ చేతిలో ఉన్న పూవులు, అక్షితలు స్వామివారి వద్ద వేస్తే మంచిది.

Bheeshma Ekadashi Special Story, Bheeshma Ekadashi , Bheeshmudu , Devotional, Telugu Devotional, Vishnu Sahasra Namalu - Telugu Bheeshmudu, Devotional, Vishnuvusahasra

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube