Ntr : సరిలేరు నీకెవ్వరూ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా ?

అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు( Sarileru Neekevvaru ).ఈ సినిమాలో ఆర్మీ జవాన్ గా మహేష్ బాబు నటించిన విషయం తెలిసిందే.

 Who Missed A Chance In Sarileru Nekevvaru-TeluguStop.com

ఇందులో యంగ్ హీరోయిన్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో విజయశాంతి ఓ ఆర్మీ జవాన్ కు తల్లిగా నటించి చాలారోజుల తర్వాత స్క్రీన్‌పై కనిపించింది.

భారీ కలెక్షన్లతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది.మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు వచ్చిన సినిమాగా నిలిచింది.

Telugu Jr Ntr, Mahesh Babu-Telugu Top Posts

అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.ఈ సినిమా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Ntr ) చేయాల్సిందట.డైరెక్టర్ అనిల్ రావిపూడి తొలుత ఈ సినిమా కథను ఎన్టీఆర్ కు చెప్పాడట.ఎన్టీఆర్ కు కూడా కథ బాగానే నచ్చింది.కానీ అప్పటికే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు తారక్ ఒప్పుకున్నాడు.దీంతో తర్వాత సినిమా చేద్దామని,ప్రస్తుతం డేట్స్ ఖాళీ లేవని అనిల్ రావిపూడికి ఎన్టీఆర్ చెప్పాడటం.

ఎన్టీఆర్ పక్కన పెట్టడంతో ఈ సినిమా కథను మహేష్ బాబుకు అనిల్ చెప్పడం, ఆ తర్వాత మహేష్ కు కూడా నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది.

Telugu Jr Ntr, Mahesh Babu-Telugu Top Posts

ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా చివరకు మహేష్ బాబు చేసి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.ఇప్పటివరకు ఈ విషయం బయటకు రాలేదు.ఇప్పుడు బయటకు రావడంతో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో అందరినీ మెప్పించాడు.ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు.

దీంతో ఆ సినిమాతో ఎన్టీఆర్ స్టార్ డమ్ మరింత పెరిగిపోయింది.అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా( Devara Movie ) చేస్తున్నాడు.

ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube