ప్రస్తుత రోజులలో పిల్లలు కొన్ని రకాల ఆహారాలకు అలవాటు పడడం వల్ల కిడ్నీలలో రాళ్ల సమస్యలు ( Kidney stone problems )ఎక్కువగా పెరిగిపోతున్నాయి.30 సంవత్సరాల క్రితం పెద్దవాళ్లలో మాత్రమే కిడ్నీలలో రాళ్ల సమస్యలు కనిపించేవి.కానీ ప్రస్తుత కాలంలో అన్ని వయసుల వారు ఈ సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు.ఎందుకంటే యాంటీ బయోటిక్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, హాట్ టెంపరేచర్ కారణంగా కిడ్నీ స్టోన్స్ సమస్యలు పెరిగిపోతున్నాయి.

ఇంకా చెప్పాలంటే అమెరికాలోని ఫిలడెల్ఫియాలో( Philadelphia, USA ) జరిగిన ఒక పరిశోధనలో ఈ విషయం తెలిసింది.ముఖ్యంగా చెప్పాలంటే మూత్రపిండాలలో ఏర్పడిన రాయి ఖనిజాలు లవణాల మిశ్రమం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.ఇది కొన్ని సార్లు మూత్ర విసర్జనకు ఆటంకం కలిగిస్తుంది.ఇప్పుడు ఈ సమస్య టీనేజర్స్ లో ఎక్కువగా కనిపిస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.ఈ రోజుల్లో జంక్ ఫుడ్, యాంటీ బయోటిక్స్( Junk food, antibiotics ) ఎక్కువగా వాడడం, ఉష్ణోగ్రత పెరగడం వల్ల శరీరంలో డిహైడ్రేషన్ కారణంగా ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

నెఫ్రోలిథియాసిస్( Nephrolithiasis ) అనేది మూత్రపిండాలకి సంబంధించిన ముఖ్యమైన సమస్యలలో ఒకటి.ఇందులో క్యాల్షియం, ఆక్సలేట్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి.దీని వల్ల మూత్రం కఠినమైన పసుపు రంగులోకి మారుతుంది.
కొన్ని సార్లు ఇసుకతో చేసిన చిన్న బంతి లేదా గోల్ఫ్ బాల్ పరిమాణంలో తయారవుతాయి.ఇవి కొన్ని సందర్భాలలో మూత్ర నాళం గుండా బయటకు వెళ్లిపోతాయి.
కానీ చాలా సార్లు అది మూత్రం నాళంలో చిక్కుకుపోతుంది.దీని వల్ల రోగి తీవ్రమైన నొప్పి, రక్తస్రావం సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపిల్లలు చిప్స్, ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఈ రాళ్ల సమస్యలు పెరుగుతున్నాయి.ముఖ్యంగా పిల్లలు తక్కువ నీరు తాగడం, అధిక మొత్తంలో ఫ్రక్టోజ్ ఆహారాలు తీసుకోవడం వారి ఆరోగ్యానికి హానికరం.
అందుకే ఇలాంటి ఆహారాలకు చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి.







