కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో తప్పటడుగులు వేయడం మూలంగా జీవితంలో ఎన్నో అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది.కచ్చితమైన నిర్ణయాలు పాటించకపోవడం వల్ల జరిగే నష్టం మళ్లీ సరిదిద్దుకోలేని విధంగా ఉంటుంది.అలాగే తన జీవితంలోనూ జరిగిందని చెప్పింది సీనియర్ నటీమణి ప్రభ.17 ఏండ్ల వయసులో నీడలేని ఆడది అనే సినిమా ద్వారా సినిమా పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది.నాలుగున్నర దశాబ్దాలుగా సినిమా రంగంలో కొనసాగుతుంది.డ్యాన్సర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.తెలుగులో టాప్ హీరోలు అందరితో కలిసి నటించింది.ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి, మోహన్ బాబు సహా పలువురు హీరోలతో కలిసి యాక్ట్ చేసింది.
అయినా.తన తోటి హీరోయిన్లు అయిన జయసుధ, జయప్రద, శ్రీదేవి, రాధికలా స్టార్ డమ్‌ను అందుకోలేకపోయింది ప్రభ.
కొన్ని అవకాశాలు చేజారిపోవడం మూలంగానే తన కెరీర్ కు నష్టం కలిగినట్లు చెప్పింది ప్రభ.వాటిలో అత్యంత కీలకమైనది ఖైదీ అంటారు ఆమె.ఆ సినిమాలు సుమలత చేసిన డాక్టర్ సుజాత క్యారెక్టర్ చేయాలని తొలుత తననే సంప్రదించారట.అయితే సినిమా యూనిట్ కు చెందిన ఓ వ్యక్తి ఈ సినిమాలో ప్రభకు ఆఫర్ చేసిన క్యారెక్టర్ కు అంత ఇంపార్టెస్స్ ఉండదని చెప్పాడట.
అందుకే అలాంటి క్యారెక్టర్ చేయడం ఎందుకని వదిలేసుకుంటద.

కానీ ఆ తర్వాత ప్రభకు తెలిసిన విషయం ఏంటంటే అది సెకెండ్ హీరోయిన్ క్యారెక్టర్.అది చేసి ఉండి ఉంటే ఇప్పుడు తన పరిస్థితి మరోలా ఉండేదని బాధపడిందట.ఈ క్యారెక్టర్ వదిలేసుకోవడం వల్ల తన కెరీర్ లో చాలా నష్టపోయినట్లు చెప్పింది.ఈ క్యారెక్టర్ చేసిన సుమలతకు మంచి పేరు వచ్చింది.ఆమెకు వరుసగా మంచి ఆఫర్లు వచ్చాయి.తను ఆ సినిమా చేసి ఉంటే మంచి హీరోయిన్ గా ఎదిగేది.
తను పెద్ద సినిమాలు ఎక్కువగా చేయకపోవడం వల్లే తన తోటి హీరోయిన్ల మాదిరిగా మంచి స్టార్ డమ్ పొందలేదని భావిస్తోంది ప్రభ.