ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా చాలా మంది తమకేమి పట్టనట్లు ఉంటారు.ఎక్కడ పడితే అక్కడ గుప్పు గుప్పుమంటూ సిగరెట్లను కాల్చుతుంటారు.
ఫ్యాషన్ పేరుతో స్మోకింగ్‌కు అలవాటు పడ్డవారూ ఉన్నారు.అయితే ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న వారు మాత్రం ధూమపానం అనే వ్యసనం నుంచి ఎలాగోలా బయట పడతారు.
కానీ, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.ధూమాపానం మానేశాక కూడా పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్ వంటి టాక్సిన్స్ నెలల తరబడి ఊపిరితిత్తుల్లోనే ఉండిపోతూ ఉంటాయి.
వీటిని పూర్తిగా తొలగించుకోవాలంటే ధూమపానం మానేశాక ఖచ్చితంగా కొన్ని కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ధూమపానం మానేశాక వాటర్‌ను అధికంగా సేవించాలి.ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటితో నిమ్మ రసం, తేనె కలిపి తీసుకోవాలి.
మామూలు టీ, కాఫీలకు బదులు మెంతి టీ, గ్రీన్ టీ, పుదీనా టీ, అల్లం టీ వంటి వాటిని తాగాలి.

పాల ఉత్పత్తులు తీసుకోవడం తగ్గించాలి.అలాగే ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, శీతల పానీయాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి.రెగ్యులర్‌గా వ్యాయామాలు, యోగా వంటివి చేస్తుండాలి.
ఉప్పు తీసుకోవడం తగ్గించాలి.ధూమపానంతో పాటు మద్యపానం అలవాటును కూడా వదిలేయాలి.
ఫలితంగా టాక్సిన్లు వేగంగా శరీరం నుంచి బయటకు వెళ్తాయి.ఉల్లిపాయ, వెల్లుల్లి, పసుపు, క్యారెట్లు, బెర్రీస్, ఆకుకూరలు, వాల్ నట్స్, కాప్సికమ్, మిరియాలు, యాపిల్, గుమ్మడికాయ.
కోడి గుడ్డు, టమాటోలు వంటి ఆహారాలను డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.తద్వారా ఈ ఆహారాల్లో ఉండే ప్రత్యేకమైన పోషకాలు మరియు శక్తి వంతమైన యాంటీ ఆక్సెడింట్స్ శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను బయటకు పంపి ఊపిరితిత్తుల పని తీరును చురుగ్గా మారుస్తాయి.







