యాదాద్రిలో సరైన వసతులు లేక భక్తుల ఇబ్బందులు.. స్పందించని దేవస్థాన అధికారులు..!

మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు, పురాతన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఈ దేవాలయాలకు ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలి వచ్చి భగవంతునికి పూజలు, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.

 Devotees Facing Problems Due To Lack Of Facilities In Yadadri Details, Devotees-TeluguStop.com

మరి కొంత మంది భక్తులు భగవంతునికి హుండీ ద్వారా కానుకలను కూడా సమర్పిస్తూ ఉంటారు.ఇలా ప్రతి రోజు వచ్చే భక్తుల కోసం దేవాలయ అధికారులు సరైన ఏర్పాట్లను చేస్తూ ఉంటారు.

కానీ తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి దేవస్థానం లో( Yadadri Temple ) భక్తులు చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజు వేలాదిగా దైవ దర్శనానికి వచ్చే భక్తులకు( Devotees ) కనీస వసతులు కల్పించడంలో ఈ దేవ స్థానం అధికారులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణం పేరు తో రూ.1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కనీస వసతులు( Facilities ) కూడా లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.భక్తులు మండే ఎండలో కాళ్లు కాలుతూ ఉన్న భగవంతుని దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.

Telugu Bhakti, Devotees, Devotional, Lack, Yadadri, Yadadri Temple-Latest News -

ఇందుకు నిదర్శనం ఎర్రటి ఎండలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడు కాళ్లు కాలుతుంటే వారి కుటుంబ సభ్యులు కాళ్లకు చున్నీలు కట్టి వృద్ధుని నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఘటన అక్కడున్న వారందరినీ బాధపడేలా చేసింది.వృద్ధులకు వీల్ చైర్ కూడా లేదు.ఉన్న ఎక్కడుంటాయో తెలియదు.

చెప్పేవారు కూడా లేరు.సరైన సమాచారం తెలిపే ఫోటోలు, బోర్డ్ లు కూడా కనిపించలేదు.

ఆదివారం వస్తే లిఫ్టులు పనిచేయడం లేదు.సిబ్బంది తాళం వేసుకొని వెళ్తున్నారు.

Telugu Bhakti, Devotees, Devotional, Lack, Yadadri, Yadadri Temple-Latest News -

దేవాలయం లోకి వెళ్ళకముందే భక్తులకు దేవుడు దర్శనమిస్తుంటాడు ముఖ్యంగా.మండే ఎండలో యాదాద్రిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు మాత్రం ఈ విషయంపై అసలు స్పందించడం లేదని భక్తులు మండిపడుతున్నారు.ఇంకా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సరైన తాగునీటి సౌకర్యం, భక్తులకు కాస్త నీడ ఉండేలా ఏర్పాటు చేయాలని కూడా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube